కరోనా విషయంలో ప్రతి వారు బాధ్యతగా ఉండకపోతే ఎంత నష్టం వాటిల్లుతుందో ప్రపంచదేశాలను చూస్తే అర్ధం అవుతుంది. ఇది ఏదో గజ్జిలాంటి అంటువ్యాధి కాదు.. అంటుకున్నాక వదిలించు కోవడానికి.. కరోనా ఒక్క సారి అంటుకుంటే బ్రతకడమా, చావడమా.. అనే ఆప్షన్స్ చాలా తక్కువ.. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండమని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఎక్కడ ఎవరు దగ్గినా, తుమ్మినా అనుమానం పడుతూ వైద్యశాఖ సిబ్బందికి సమాచారం అందిస్తున్నారు..

 

 

ఇక ఎంతో జాగ్రత్తగా వ్యవహరించవలసిన నర్సు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించింది.. ఈమె తీరుకు విమర్శలు వస్తున్నాయి.. అదేమంటే.. ఇప్పటికే విదేశాలనుండి ఎవరైన వస్తే దొంగ వచ్చినట్లుగా గుచ్చి గుచ్చి చూస్తున్నారు.. అంతే కాకుండా విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నారు... కొంతమంది హోం క్వారంటైన్‌లో వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇక కొందరు మూర్ఖులు మాత్రం విదేశాల నుంచి వచ్చి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో అదే జరిగింది.

 

 

ఓ నర్సు తన భర్త విదేశాలకు వెళ్లి స్వదేశానికి వచ్చిన విషయాన్ని దాచారు.. మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో ఆ నర్సు కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తోంది. ఆమె భర్త ఈ నెల విదేశీ పర్యటన నుంచి మచిలీపట్నం వచ్చాడు. ఈ విషయాన్ని ఆ నర్సు గోప్యంగా ఉంచింది. ఈ విషయం ఎలాగో బయటపడటంతో.. ఆమెను విధుల నుంచి తొలగిస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ లోపల ఈ నర్సు భర్త మచిలీపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల్లో పర్యటించినట్లు అధికారుల విచారణలో తేలింది.

 

 

దీంతో అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తరలించి, అధికారులు ఇతను ఎవరెవరిని కలిశాడో అని ఆరా తీస్తున్నారు.. నిజానికి ఇంత బుద్ధిహీనంగా ప్రవర్తించిన ఈ భార్యభర్తలను ఏమనాలో మీరే ఆలోచించండి..  ఒకవేళ ఇతనికి కరోనా ఉందని తేలితే.. ఇతని వల్ల ఎంతమందికి నష్టం.. ఇక ఇలాంటి వారు ఉండటం వల్లే ఈ వ్యాధి ఇంతలా విస్తరిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: