ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా నిమిషం నిమిషానికి విజృంభిస్తోంది. క్ష‌ణం క్ష‌ణానికి క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కేవలం ఒక రోజు వ్య‌వ‌ధిలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా ల‌క్ష‌న్నర పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఆదివారం ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు చూసుకుంటే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,63, 740 న‌మోదు అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు 30, 879 మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. ఇక 1,42, 183 రిక‌వ‌రీ కేసులు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా చూసుకుంటే 4,90, 678 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా... 1,73,062 కేసులు క్లోజ్ అయ్యాయి.

 

ఇక భార‌త్‌లో సైతం క‌రోనా రోజు రోజుకు కోర‌లు చూస్తూ ప్ర‌జ‌ల‌ను కాటేస్తోంది. ఇప్పటి వ‌ర‌కు మ‌న‌దేశంలో క‌రోనా కేసులు 900కు పైగా న‌మోదు అయ్యాయి. వీరిలో 20 మంది మృతి చెందారు. మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, తెలంగాణ‌లో క‌రోనా కేసులు ఎక్కువుగా ఉన్నాయి. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 19 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ‌తో పోలిస్తే బెట‌ర్ పోజిష‌న్‌లోనే ఉంది. తెలంగాణ‌లో మొత్తం 67 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న హైద‌రాబాద్లో ఓ వృద్ధుడు మృతి చెంద‌డంతో తెలంగాణ‌లో తొలి క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించిన‌ట్ల‌య్యింది.

 

ఇదిలా ఉంటే దేశంలో కరోనా వ్యాప్తి మూడో దశలోకి ప్రవేశించనుందన్న అనధికార వార్తలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి వేగవంతమైందనడానికి సూచిక కాదని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) తేల్చిచెప్పింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: