కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో పుట్టి అన్ని దేశాలకు విస్తరించింది. మనకు కరోనా సోకితే ఎలాంటి లక్షణాలు వస్తాయో అవన్నీ మనకు తెలిసిందే.. అయితే.. వస్తువులపై కరోనా వైరస్ ఉంటే అది మనకు సోకకుండా ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా స్పష్టం చేస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). అసలు కరోనా వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా కూడా వారి నోటి నుంచి, ముక్కు నుంచి వచ్చే తుంపర్లలో ఉన్న ఈ కరోనా వైరస్ మూడు గంటల వరకు బతికి ఉంటుందని మనం తెలుసుకున్నాం.

 

అలాగే ఏదైనా వస్తువులపై ఉదాహరణకు స్టెయిన్ లెస్ స్టీల్, ప్లాస్టిక్, బెంచీలు, గ్లాసులపైన కరోనా వైరస్ మూడు రోజులు బతికి ఉంటుందని పరిశోధనలలో అర్థమైంది. ఇంకా అవే కాకుండా పేపర్, ఫాబ్రిక్, కార్డ్ బోర్డ్, హెస్సియన్ వంటి వాటిపై అది 24 గంటలు బతికి ఉంటుందని అర్థమైంది. మన ప్రపంచంలో ఉన్న 200 రకాల వైరస్‌ లలో కరోనా వైరస్ అనేది ఒక రకం. అయితే.. అసలు ఏదైనా వస్తువులపై కరోనా ఉంటే ఏమి కాదు. ఆ విషయానికొస్తే.. మనం నిత్యం ఉపయోగించే వస్తువులపై లెక్కలేనన్ని వైరస్ లు ఉంటాయి. వాట్లలో ఇది ఒకటి కాకపోతే ఈ కరోనా వైరస్ అనేది మన బాడీకి సెట్ కావట్లేదు. అంటే ఏదైనా ఒక వస్తువును ముట్టుకున్నపుడు ఎలాగోలా మన శరీరంలోకి వెళ్తుంది. అది శరీరంలోకి వెళ్ళాక బ్యాక్టీరియా పూర్తిగా వైరస్ తో గెలవలేకపోతోంది.

 

కానీ.. ఈ వైరస్ తో పోరాడి 100 మందిలో 82 మంది గెలుస్తున్నారు. ఇక మిగతా 18 మంది మాత్రం వైరస్ చేతిలో ప్రాణాలు విడుస్తున్నారు. అసలు ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించాలంటే నాలుగు మార్గాలు ఉన్నాయి. అవి ముక్కు, నోరు, కళ్లు, చెవులు కావున మన ఇంద్రియాల వరకు ఈ వైరస్ చేరకుండా ఉంటే మనకు వైరస్ సోకనట్లే కదా.. ఒక వస్తువుని ముట్టుకున్నపుడు ఆ వైరస్ అనేది మన చేతులకు అంటుతుంది దీంతో ఈ వైరస్ మన చేతుల ద్వారా మన ఇంద్రియాలను తాకినప్పుడు వైరస్ వాటి గుండా ప్రయాణించి మనకు వైరస్ సోకుతుంది.

 

ఇలా కాకుండా ఉండాలంటే.. ప్రతీ రెండు గంటలకు ఒకసారి సబ్బుతో శుభ్రంగా చేతుల్ని కడుక్కోవాలి. అనంతరం శానిటైజర్ రాసుకోవాలి. మనం సబ్బుతో చేతుల్ని కడిగినపుడు 99 శాతం వైరస్ పోతుంది. ఆ తర్వాత హ్యాండ్ శానిటైజర్ రాసుకోగానే మిగతా వైరస్ కూడా చస్తుంది. అప్పుడు మనం వస్తువుల్ని టచ్ చేసినా పర్వాలేదు. ఇలా మనం జాగ్రత్తలు పాటిస్తే కరోనా వైరస్ మన దగ్గరకు కూడా రాదు. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన జాగ్రత్త తీసుకుంటూ వీలైనంతవరకూ మన ప్రాణాలను కాపాడుకుందాం.. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: