ప్రపంచంలో అన్నిదేశాల అన్నగా చెప్పుకుంటున్న అమెరికాకు తీరని కష్టాలు వచ్చిపడుతున్నాయి.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన మాయదారి కరొనా మహమ్మారి ఇప్పుడు అమెరికాకు లాంటి పెద్ద దేశానికి శాపంగా మారుతుంది.  ఇక్కడ గత మూడు రోజుల్లోనే మృతుల సంఖ్య రెట్టింపవడం మరింత వణికిస్తోంది. గురువారం 1000గా ఉన్న మరణాల సంఖ్య నేటి ఉదయానికి ఏకంగా 2,211కు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కరోనా బాధితుల సంఖ్య 1,24,385కు పెరిగింది. కరోనా కేసులు నిన్న ఒక్క రోజే ఏకంగా 23 శాతం పెరగడం గమనార్హం.  

 

అమెరికా అధక్షులు ట్రంప్ మొన్నటి వరకు మేకపోతు గాంభీర్యం వహించినా.. పెరుగుతున్న మరణాల చూసి ఆయన సైతం బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడింది.  కరోనా కేసులు నిన్న ఒక్క రోజే ఏకంగా 23 శాతం పెరగడం గమనార్హం. విస్తృత కరోనా పరీక్షల కారణంగానే కొత్త కేసులు వెలుగుచూస్తున్నట్టు అధికారులు తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారిపైనే ఇప్పటి వరకు కరోనా పంజా విసరగా, తాజాగా ఇల్లినాయిస్‌లో ఓ శిశువు కరోనా కారణంగా మరణించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

 

స్పెయిన్‌లో కరోనా వైరస్ విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. ప్రతి రోజు వందల సంఖ్యలో ప్రాణాలు తీస్తూ విలయతాండవం చేస్తోంది. 24 గంటల్లోనే ఇక్కడ ఏకంగా 832 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టిస్తుంది. తాజా మరణాలతో స్పెయిన్‌లో మృతి చెందినవారి సంఖ్య 5,690కి చేరుకుంది. అలాగే మొత్తం కేసుల సంఖ్య 72,248కి పెరగ్గా, 12,285 మంది కోలుకున్నారు. స్పెయిన్‌తో పోలిస్తే ఇటలీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: