కరోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. పేరు వింటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దీని ధాటికి ప్ర‌జ‌లు ఇల్లు దాటికి బయటికి రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్‌...ఇప్పుడ 185 దేశాలకు పాకింది.  ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 660064 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 141422 మంది మాత్రం కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో కరోనా మృతుల సంఖ్య 30641కి చేరింది. చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, ఇరాన్ వంటి దేశాల్లో మరణాల సంఖ్య భయాందోళనలను కలిగిస్తోంది.

 

భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మనదేశంలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 21కి చేరుకుంది. ఈ మహమ్మారికి జన్మనిచ్చిన చైనాలో కంటే పొరుగు దేశాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు అన్ని దేశాలు కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. అయితే కొంద‌రు ఆక‌తాయిలు మాత్రం ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థిల్లోనూ రోడ్ల‌పైకి వ‌చ్చిన చ‌క్క‌ర్లు కొడుతున్నారు. అయితే వారిని పుట్టుకున్న పోలీసులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లో కొంద‌రు ఆక‌తాయిలు ఏ విధమైన పని లేకుండా రోడ్లపైకి వచ్చి చక్కర్లు కొడుతుంటే, వారిని పట్టుకున్న అధికారులు వినూత్న శిక్ష విధిస్తున్నారు.

 

వారిని క్వారంటైన్ సెంటర్లలో ఉన్న అనుమానిత రోగుల సేవ నిమిత్తం పంపుతున్నారు. ఈ సంద‌ర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. ఇలా వస్తున్న వారిని అరెస్టు చేయడం, లేదా లాఠీలతో కొట్టడం చేయకూడదని నిర్ణయించుకున్నామని, వారిని తీసుకెళ్లి, జేజేటీ వర్సిటీ, సింఘానియా వర్సిటీల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. వారితో రోగులకు సేవ చేయిస్తున్నామని తెలిపారు. కాగా, నిజానికి ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లలో పనిచేసే సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీన్ని గమనించిన పోలీసులు, ఉల్లంఘనులను పట్టుకుని, వారి ద్వారా రోగులకు సేవలు చేస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: