మొన్నటి వరకు చైనా, ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా లో అనకుంటే ఈ దరిద్రం ఇప్పుడు మన దేశానికి పాకింది.  చిన్న చిన్నగా దీని ప్రభావం రోజు రోజు కీ పెరిగిపోతుంది.  ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మరణం లేదు.. కేవలం బాధితులే అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటి మరణం సంబవించడంతో అంతా అలర్ట్ అయ్యారు. 

 

లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్న తెలంగాణ సర్కారు ముందు ఇప్పుడో కొత్త సమస్య వచ్చి పడింది.  ఇక ఈ కేసులన్నీ రాష్ట్రంలోని 5 జిల్లాల నుంచి మాత్రమే వచ్చాయి. హైదరాబాద్, కరీంనగర్, భద్రాద్రి-కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల్లో మినహా తెలంగాణలో మరే ప్రాంతంలోనూ ఇంతవరకూ ఒక్క కేసు కూడా బయట పడలేదు. మిగతా జిల్లాలకు వ్యాధిని సోకకుండా చూసే విషయంలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది.

 

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలకు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉండటం, జన సాంద్రత అధికం కావడం తదితర కారణాలతో వ్యాధి విస్తరణ గ్రేటర్ హైదరాబాద్ లో అధికంగా ఉంది.  ఏది ఏమైనా లాక్ డౌన్ ఉన్నా కూడా కొంత మంది బరితెగించి బయట తిరగడంపై తెలుగు రాష్ట్ర సీఎంలు మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 


apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: