కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇప్పుడు అమెరికా ప్రభుత్వం చైనాతో రాజీకి ప్రయత్నాలు చేస్తుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. చైనా సహకారం లేకుండా అమెరికాకు ఇప్పుడు దాన్ని కట్టడి చేయడం అనేది సాధ్యం కాని పని అంటున్నారు. చైనా విషయంలో ట్రంప్ ముందు నుంచి కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చైనానే వైరస్ ని సృష్టించింది అనే ఆరోపణలు వరుసగా చేస్తున్న ట్రంప్ ఇప్పుడు మాత్రం వెనక్కు తగ్గారు. ముందు చైనా ల్యాబ్ లోనే ఇది పుట్టిందని అమెరికా ఆరోపణలు చేసింది. ఊహాన్ ల్యాబ్ లో దీన్ని సృష్టించారు అని అమెరికా ఆరోపణలు చేస్తుంది. 

 

ఇప్పుడు కరోనా కట్టడి కావాలి అంటే మాత్రం కచ్చితంగా చైనా సహకారం అవసరం అనే అంగీకారానికి అమెరికా ప్రభుత్వ పెద్దలు వచ్చేశారు. ట్రంప్ కి ఆసియాలో పెట్టుబడులు ఎక్కువ. కాబట్టి ఆయన ఆసియా దేశాలతో ముందు నుంచి కూడా సన్నిహితంగానే ఉంటారు. అమెరికా, రష్యా మధ్య మాటల యుద్ధం కూడా ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత దాదాపుగా తగ్గింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ట్రంప్ టవర్స్ రష్యాలో ఎక్కువ. మాస్కో వెళ్ళిన సమయంలో ఆయనకు రష్యా ప్రభుత్వం విలాసవంతమైన హోటల్స్ ఇవ్వడమే కాకుండా అమ్మాయిలను కూడా సరఫరా చేసే వారని ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. 

 

ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవడానికి రష్యా, చైనా కారణమని కొందరు వ్యాఖ్యానించారు. అయితే రష్యా విషయంలో ట్రంప్ సానుకూలంగా ఉన్నా సరే చైనా ఉత్పత్తులను మాత్రం ఆయన అమెరికా రానీయడం లేదు. అక్కడి ఉత్పత్తుల విషయంలో ఆయన సానుకూలంగా లేరు. అమెరిక కాంగ్రెస్ ని కూడా ట్రంప్ ఒప్పించారు. ఇప్పుడు కరోనా విషయంలో చైనా సహకారం లేకపోతే మాత్రం తన వలన కాదు అనే అభిప్రాయానికి ఆయన వచ్చేశారు. అందుకే ఇప్పుడు చైనాతో కలిసి పోరాడాలి అని నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: