రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. కరోనాకి ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రపంచాన్ని తన గుప్పిట్లో బంధించిన భయానక కరోనా వైరస్‌ను మట్టుబెట్టడానికి భారత్ సహా ప్రపంచదేశాలు చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. ఎవరు ఎన్ని రకాలుగా తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ ఈ వైరస్ తీవ్రత మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. లక్షలాది మంది ప్రజల శరీరాల్లో తిష్టవేసుకుని కూర్చుంది. ఐసొలేషన్ కేంద్రాలుగా ఒక్క మన రాష్ట్రంలోనే 27 వేల మందికి పైగా స్థానికులు విదేశాల నుంచి వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతోంది. ఈ వైరస్ బారిన పడిన పేషెంట్లకు చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం వందల సంఖ్యలో ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. నియోజకవర్గానికి వంద పడకల సామర్థ్యంతో ఐసొలేషన్ కేంద్రాలను నెలకొల్పింది. జిల్లా కేంద్రం స్థాయిలో ఈ సంఖ్యను రెట్టింపు చేసింది. కాలేజీలు, స్కూల్స్, ఫంక్షన్ హాల్స్ మొదలైనవన్నీ ప్రస్తుతం ఐసొలేషన్ కేంద్రాలుగా అవతరించాయి.

 

ఇదిలా ఉండగా పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది మంది భక్తులు కలియుగ వైకుంఠంలా ఆరాధిస్తోన్న తిరుమలను కరోనా వైరస్ ఆసుపత్రిగా మార్చాలనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. దీన్ని లేవనెత్తిన వారిలో ఒకరిద్దరు ప్రముఖులు కూడా ఉండటం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తిరుమలను ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వైరస్ ఆసుపత్రిగా మార్చడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచిస్తున్నారు. తిరుమలను ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వైరస్ ఆసుపత్రిగా మార్చాలనే డిమాండ్ పట్ల రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు ఈ ఆలోచనను ప్రశంసించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ప్రతిపాదనను పరిశీలించాలంటూ ఆయన వైఎస్ జగన్‌కు సూచించడం కొసమెరుపు. ఐవైఆర్ కృష్ణారావు విభజన తరువాత ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది.

 

ఐవైఆర్ కృష్ణారావు వంటి మాజీ బ్యురోక్రాట్, బీజేపీ నాయకుడు ఈ ప్రతిపాదనను మెచ్చుకోవడంతో అది కాస్తా సంచలన వార్తగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచీ వచ్చే భక్తుల సౌకర్యం కోసం వందల సంఖ్యలో గదులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉంటోన్న ఆ గదులను ఐసొలేషన్ కేంద్రాలుగా మార్చితే బాగుంటుందంటూ వచ్చిన ఓ సందేశాన్ని ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రికి షేర్ చేశారు. ఈ దిశగా ఆలోచన చేయాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రికి సూచించారు. వైఎస్ జగన్‌కు ట్యాగ్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఇది సంచలన వార్తగా మారుతోంది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

https://twitter.com/IYRKRao/status/1243858878296551425?s=20

https://twitter.com/Aarismohammed/status/1243857212839092224?s=20

మరింత సమాచారం తెలుసుకోండి: