కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జనాలను బయటకు రానీయకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. ఎక్కడి వారిని అక్కడే ఉంచడానికి కష్టపడుతున్నాయి. కొంత మంది సాడిస్ట్ లు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. మరి వాళ్లకు సీరియస్ నెస్ అర్ధమవుతుందో లేదో తెలియడం లేదు గాని కొంత మంది మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఇతరులను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు. దీనితో పరిస్థితులు క్రమంగా క్షీణిస్తూ వైరస్ వ్యాప్తికి ఎక్కువగా సహకరిస్తున్నాయి అనేది వాస్తవం. 

 

ఇప్పుడు మన దేశంలో కరోనా వైరస్ కట్టడి కావాలి అంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ఈ నేపధ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కొన్ని చర్యలను చాలా పక్కగా తీసుకుంటుంది. ఇక నుంచి నిత్యావసర సరుకులను పాలను కొన్ని రకాల మందులను రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇవ్వాలని చూస్తుంది. దీనిపై ఇప్పటికే పౌరస సరఫరాల శాఖా మంత్రి కొడాలి నానీ అధికారులతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రవాణా శాఖా మంత్రి పెర్ని నానీ ఈ మేరకు ఇప్పటికే అధికారులకు సూచనలు చేసినట్టు సమాచారం. 

 

పాలను ఇప్పటికే సరఫరా వారి ద్వారానే చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మిగిలిన కూరగాయలు, అలాగే పప్పులు ఉప్పులు కూడా ఇలాగే సరఫరా చెయ్యాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 20 వరకు చేరుకున్నాయి. దీనితో ప్రభుత్వం కాస్త కఠినం గా వ్యవహరించే యోచనలో ఉంది. ప్రతీ చిన్న విషయంలో కూడా జగన్ సర్కార్ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది. త్వరలోనే ఈ నిర్ణయం అమలు చెయ్యాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: