తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు 70 వరకు ఉన్న నేపధ్యంలో ప్రజలను అసలు బయటకు రానీయకుండా చూడటానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చెయ్యడానికి సిద్దమైంది. ప్రజలు మాట వినకపోతే మాత్రం ఇంకా సీరియస్ గా ఉండాలని భావిస్తుంది. అవసరమైతే కాల్చి వేసే ఉత్తర్వులను కూడా హోం శాఖ ఇవ్వాలని భావిస్తుంది. కెసిఆర్ ఇప్పటికే దీని మీద కసరత్తులు కూడా చేస్తున్నారు. ఇక ప్రజలకు సరుకులు అందించే విషయంలో మరింత దూకుడుగా ముందుకి వెళ్ళాలి అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపధ్యంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 

 

ఇక నుంచి పాలను ఫుడ్ డెలివరి సంస్థల ద్వారా అందించాలని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణా పశు సంవర్ధక శాఖా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్ణయం తీసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. శనివారం హైదరాబాద్ లో మాసాబ్ ట్యాంక్ లో ఆయన పలు డైరీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తి గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఉత్పత్తి భారీగా తగ్గింది అని ప్రతినిధులు వివరించారు. సిబ్బంది సరఫరా చేయడానికి కూడా రావడం లేదని అన్నారు. దీనితో మంత్రి ఒక సూచన చేసారు. 

 

ఇక నుంచి పాలను పూర్తిగా… స్విగ్గి, బిగ్ బాస్కెట్, ఫుడ్ పాండా ద్వారా సరఫరా చెయ్యాలని ఆయన సూచనలు చేసారు. ఇలా అయితే ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చని ఆయన చెప్పారు. దీనికి ప్రతినిధులు కూడా ఓకే చెప్పారు. త్వరలోనే ఈ నిర్ణయం అమలులోకి రానుంది. గ్రామ స్థాయిలో దీన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇక కూరగాలను కూడా ఇలాగే అందించే యోచనలో ఉన్నారు. ప్రతీ ఒక్క సరుకుని ఇలాగే అందించాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: