ఆడపిల్లల్ని మైనస్ గా ట్రీట్ చేసి,  ఆడ పిల్లల వల్ల లాభం లేదు అని చింతించే వారు ఎందరో. కానీ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి  ఇది నిజంగా శుభవార్తే. అయితే మీకు ఆడపిల్ల పుట్టిందా....? ఆలస్యం వద్దు ఇప్పుడే సుకన్య సమృద్ధి యోజన పధకాన్ని వినియోగించుకోండి.

 


కేంద్ర ప్రభుత్వం ఆడ పిల్లల కోసం వారి ఆర్థిక భద్రతని దృష్టిలో పెట్టుకుని వారు దీనిని లక్ష్యంగా  ఈ పథకాన్ని ప్రజలకి అందుబాటు లోకి తీసుకు వచ్చారు . దీని వల్ల ఆర్ధికంగా ఆడ పిల్లలకి భద్రత  ఉంటుంది. దీనిలో  ఇప్పటికే చాలా మంది చేరడం కూడా జరిగింది. ఈ పథకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ  ప్రయోజనాలు చక్కగా సులువుగా పొందొచ్చు.

 


ఇందులో ముఖ్యం అయినది ఏమిటి అంటే ఆడ పిల్లల పేరుపై డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. అప్పుడు దీని నుండి రాబడి కూడా పొందొచ్చు. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల వరకు చెయ్యవచ్చు. ఇందు వలన వడ్డీ ఎంత వస్తుందో తెలుసా? 8.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. నిజంగా ఇది గొప్ప విషయము . ప్రతీ ఆర్ధిక సంవత్సరం ముగింపు అయ్యాక ఆ అకౌంట్ లో జమ అవుతుంది. అంతే కాకుండా వడ్డీ రేట్లు కూడా మూడు నెలలకి ఒకసారి మారుతుంది. 

 


ఇలా ప్రతీ నెల ఎంతో కొంత డబ్బు ఆదా చెయ్యవచ్చు. రూ.1.5 లక్షల వరకు సుకన్య సమృద్ధి అకౌంట్‌లో డిపాజిట్ చేస్తే కనీసం రూ.250 డిపాజిట్ చేసినా కూఅడా సరిపోతుంది. రూ.250 కాకుండా నెలకు కనీసం రూ.1,000 కట్టుకుంటే కూడా  మంచిది. ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 15 ఏళ్లు వరకు అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుందనే విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి: