క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  ఎలా వస్తుందో, ఎటువైపు నుంచి వస్తుందో తెలియక ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం.. వ్యక్తిగత శుభ్రతను పాటించడం ద్వారా కరోనాను దూరం పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డో ఒక‌చోట క‌రోనా సాసిటివ్ కేసులు వేగాన్ని పుంజుకుంటూ దూసుకుపోతోంది. ఇక కరోనాకు ఇంతవరకూ మందు లేకపోయినా, ఆ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. 

 

ఈ భూమండలాన్ని మట్టుబెట్టేలా చుట్టబెట్టి పారేసిన భయానక కరోనా వైరస్‌కు మూలం ఎక్కడో కొన్ని నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. చైనాలోని వూహాన్‌లోని హువాన్ మార్కెట్‌లో రొయ్యలు అమ్ముకునే వెయ్ గుషియన్(57) అనే మహిళకు ఈ వైరస్ మొట్టమొదటగా సొకినట్లు ఓ ప్ర‌ముఖ‌ పత్రిక వెల్ల‌డించింది. ఆమెను ‘పేషెంట్ జీరో’గా వర్ణించింది. ట్విస్ట్ ఏమిటంటే ఈ తొలి పేషెంట్ జీవించే ఉన్నారు. స్థానికంగా ఉండే హునన్ సీఫుడ్ మార్కెట్‌లో గుషియన్ రొయ్యలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేది. అయితే 2019 డిసెంబరు 10న ఆమెకు జలుబుతో కూడిన జ్వరం వచ్చింది. 

 

దీంతో ద‌గ్గ‌ర‌లో ఉన్న క్లినిక్‌లో వైద్యం తీసుకున్నా తగ్గ‌క‌పోవ‌డంతో  మరో ఆసుపత్రికి, తరువాత మరో ఆసుపత్రికి ఇలా తిరుగుతూ చివరకు డిసెంబరు 16న ఆ ప్రాంతంలోనే పేరెన్నికగన్న వూహాన్ యూనియన్ హాస్పిటల్‌కు వెళ్లింది. అప్పటికే హునన్ మార్కెట్‌ ప్రాంతంలోని అనేకమంది అదే తరహా అనారోగ్య లక్షణాలతో అక్కడికి వచ్చి ఉన్నారు. అయితే గుషియన్‌ను కొన్ని రోజులు పరిశీలించిన డాక్టర్లు.. రక్త పరీక్షలను నిర్వహించారు. రెండురోజుల తరువాత దాని ఫలితాలను చూసి డాక్టర్లు బిత్తరపోయారు. అందులో గుషియన్‌ను భయానక కరోనా వైరస్ సోకినట్లు స్పష్టమైంది. 

 

దీనితో ఆమెను డిసెంబరు ఆఖరు వారంలో ఆమెను క్వారంటైన్ చేశారు. అయితే నెల రోజుల చికిత్స తరువాత ఆమె జనవరిలో పూర్తిగా కోలుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన అనారోగ్యానికి కారణం కరోనా వైరస్సేనని తాను భావించలేదని.. తాను ఈ వైరస్ బారిన పడిన తరువాత కూడా వ్యాపారాన్ని కొన్ని రోజులు కొనసాగించానని, ఆ సమయంలో అనేకమంది తనకు దగ్గరగా వచ్చారని, వారికి కూడా ఈ వైరస్ సోకి ఉంటుందని అవేద‌న వ్య‌క్తం చేసింది.  ప్రభుత్వం ముందుగా స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఈ వైరస్ వ్యాప్తిని ప్రారంభదశలోనే అరికట్టగలిగేదని ఆమె వాపోయింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: