అమెరికాలో కరోనా కేసులు ఆగడం లేదు.  రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  వెయ్యి రెండు వేలు కాదు.  రోజుకు మినిమం పదివేలకు పైగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా మహమ్మారి అమెరికాలో రోజుల పసిపాపను బలి తీసుకుంది. ఇల్లినాయిస్ లో శనివారం నాడు ఓ చిన్న బిడ్డ కొవిడ్-19 సోకి మరణించినట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. 

 

గత సంవత్సరం చైనాలోని వూహాన్ లో వైరస్ తొలిసారిగా వెలుగులోకి వచ్చిన తరువాత, వ్యాధి బారినపడి మరణించిన తొలి పసిబిడ్డ ఘటన ఇదే. కరోనా వైరస్ ను రాజకీయంగా మొదట్లో కొట్టేసి లైట్ గా తీసుకోవడంతో ఇప్పుడు అమెరికాకు మించిన భారమై కూర్చున్నది.  మూడో స్టేజ్ వరకు పెద్దగా పట్టించుకొకపోవడం, పదేపదే చైనాపై నిందలు వేస్తూ సమయం వృధా చేయడంతో అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

 

అమెరికాలోని 50 రాష్ట్రాలలో కరోనా వైరస్ వ్యాపించింది.  అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలను లాక్ డౌన్ చేశారు తప్పించి అమెరికా మొత్తం లాక్ డౌన్ చేయలేదు.  కరోనా వల్ల  మరణించిన తొలి పసిబిడ్డ ఈ విషయాన్ని వెల్లడించిన ఇల్లినాయిస్ గవర్నర్ జేఫీ ప్రిట్జకర్, గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా మరణించిన వారిలో ఓ పసిపాప కూడా ఉందని తెలిపారు. ఈ బిడ్డ రక్త పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని అన్నారు. రోజుల చిన్నారికి కరోనా సోకి మరణించినట్టు ఇంతవరకూ లేదని తెలిపారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: