ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ అనేక దేశాల‌ను స‌ర్వ‌నాశ‌నం చేసేసింది. ఇక మ‌న‌దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రెండో దశలో ఉంది. సగటున దేశంలో రోజూ 100కు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇక వ‌చ్చే 15  రోజులు ప్ర‌పంచం సంగ‌తేమో గాని మ‌న‌కు.. మ‌న దేశానికి అత్యంత కీల‌కం అని చెప్పాలి. ఇక ఇప్ప‌టికే జాగ్రత్తగా ఉండాలంటూ స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జాగ్రత్తపడాల్సిన అతివిలువైన సమయాన్ని దుర్వినియోగం చేసినందున తీవ్ర భయంకర పరిస్థితిని చవిచూస్తున్నామని.. ఇప్ప‌ట‌కి ఈ ముప్పున‌కు గురి కాని వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచ‌న‌లు జారీ చేస్తోంది.

 

ఇక ఇట‌లీ, స్పెయిన్ దేశానికి చెందిన పౌరుల వీడియోలు సైతం మ‌న‌కు హెచ్చ‌రికాలు జారీ చేస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జన సమూహాలు కనిపిస్తున్నందున లాక్‌డౌ న్‌ ఉద్దేశం నీరుగారుతోందని నిపుణులు అంటున్నారు. ఇక ఆదివారం ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న రిపోర్టులు చూస్తే పాజిటివ్ కేసులు 6,64,192 న‌మోదు అవ్వ‌గా.. 30, 888 మంది మృతిచెందారు. ఇక 1,42,364 మంది రిక‌వ‌రీ అయ్యారు. ఇప్ప‌ట‌కీ 4,90, 940 మందికి ఈ వైర‌స్ యాక్టివ్‌గా ఉంది. ఇక 1,73,252 కేసులు క్లోజ్ అయ్యాయి. 

 

ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా 199 దేశాల‌కు విస్త‌రిస్తోంది. ఇక మ‌న‌దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 979 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవ్వ‌గా 26 మంది మృతిచెందారు. మ‌హారాష్ట్ర‌లో 193, కేర‌ళ‌లో 176గా కేసులు ఉన్నాయి.  ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ‌లో కేసులు 67 ఉండ‌గా.. ఏపీలో ఈ సంఖ్య 19కు చేరుకుంది. 

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం..

క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: