కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మాన్ కి బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. దేశ ప్రజలతో ఆయన ఈ సందర్భంగా కరోనా వైరస్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను పంచుకున్నారు. ప్రజలు అందరూ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపై ఆయన పలు సూచనలు చేసారు. కరోనా వైరస్ ని జయించాలి అంటే మాత్రం కఠినం గా ఉండక తప్పడం లేదని మోడీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు వైద్యులతో మాట్లాడారు. అలాగే దేశ ప్రజలతో కూడా ఆయన తన మనసులో మాటను పంచుకున్నారు. 

 

ఈ కార్యక్రమంలో వైద్యులను ఉద్దేశించి మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు. వాళ్ళు జవాన్ల మాదిరిగా పోరాడుతున్నారని అన్నారు. వైద్యులు అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మోడీ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ నయం అయ్యే వ్యాధే అన్న ఆయన ప్రజలు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటే దాని మీద గెలవడం అనేది పెద్ద కష్టం కాదని అన్నారు. మనం అందరం కలిసి కరోనా మీద యుద్ధం చేస్తే దాన్ని దేశం నుంచి తరమడం పెద్ద విషయం కాదని మోడీ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ అనేది మందు లేని వ్యాధి అన్న మోడీ

 

వ్యాధిని నయం చెయ్యాలి అంటే లాక్ డౌన్ అనేది తప్పనిసరి అన్నారు. మనం అందరం కూడా స్వీయ నియంత్రణ పాటిస్తే కచ్చితంగా కరోనా మీద యుద్ధం చేసి గెలవడం పెద్ద విషయం కాదని అన్నారు. ప్రజలు అందరూ లాక్ డౌన్ ని కఠినం గా పాటించాలని అన్నారు. మనం కంట్రోల్ లో లేకపోతే అది మరొకరికి సోకుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రజల రక్షణ కోసమే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కరోనా ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: