దేశంలో కరోనా బాధితుల సంఖ్య కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 979కు చేరింది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ వీరిలో 25 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 12 కొత్త కేసులు వెలుగులోకి రావడంతో బాధితుల సంఖ్య 193కు పెరిగింది. దేశంలో ఇప్పటివరకూ 86 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 
 
తెలంగాణలో నిన్న ఒక్కరోజే 8 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో బాధితుల సంఖ్య 67కు చేరింది. ఏపీలో నిన్న ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనాపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వస్తువుల ద్వారా కరోనా సోకే అవకాశం ఉందని తేలింది. బెంచీలు, గ్లాసులు, స్టీల్, ప్లాస్టిక్ వస్తువులపై వైరస్ మూడు రోజుల వరకు బ్రతికి ఉంటుంది. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వస్తువుల ద్వారా కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేసింది. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించాలంటే కళ్లు, ముక్కు, నోరు కీలకం అని ఈ ఇంద్రియాలకు వైరస్ సోకకుండా చూసుకుంటే కరోనా భారీన పడమని WHO సూచిస్తోంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి సబ్బుతో చేతులు కడుక్కుని... ఆ తర్వాత హ్యాండ్ శానిటైజర్ రాసుకుంటే అందులో ఉండే ఆల్కహాల్ కంటెంట్ వల్ల వైరస్ చచ్చిపోతుందని పేర్కొంది. 
 
కరోనా కట్టడి అయ్యే వరకు చేతులు, వేళ్లతో ఇంద్రియాలను ముట్టుకోకుండా జాగ్రత్త పడాలని సూచిస్తోంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా భారీన పడే అవకాశాలు చాలా తక్కువని WHO చెబుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా భారీన పడకుండా తప్పించుకోవచ్చని WHO సూచిస్తోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: