ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కలవర పెడుతుంది. రోజు రోజుకు ఈ వైరస్ విజృంభించడంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువ అవుతుంది. ఈ మహామ్మరిని అరికట్టేందుకు ఎలాంటి వ్యాక్సిన్ నిర్దారణ కాలేదు. దీనిని స్వీయ నిర్బంధన ద్వారా కొంత వరకు అయినా ఈ వైరస్ వ్యాపించకుండా ఉంటుందన్నారు. అందుకు కొన్ని దేశాల్లో లాక్ డౌన్ విధించారు.

 

కేసులు మున్ముందు లక్షలకు చేరతాయేమోననే ఆందోళన భారతదేశంలో పెరుగుతోంది. ఆ ప్రమాదాన్ని నివారించాలంటే దక్షిణ కొరియా తరహాలో టీ టెస్ట్ అనే త్రిముఖ వ్యూహం చేపట్టాలి. కరోనా అనుమానితుల ఆచూకీని వెంటనే పసిగట్టి, వారిని పరీక్షించి, శీఘ్ర చికిత్స అందించాలి.

 

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం టీ 3 వ్యూహాన్ని చేపడుతున్నట్లు ఇటీవల ప్రకటించడం స్వాగతించాల్సిన అంశం. దీన్ని దేశమంతటికీ విస్తరించాలంటే అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనా కేసుల పరీక్ష, క్వారంటైన్ చికిత్స పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి.

 

కరోనా అనుమానితుల జాడను చప్పున పసిగట్టడం టీ 3 వ్యూహంలో మొదటి అంచె. భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గ్రామీణ శిశు సంరక్షణ వర్కర్లకు ఈ బాధ్యత అప్పగించారు. దాన్ని సక్రమంగా నిర్వహించడానికి ఆన్ లైన్లో శిక్షణ ఇస్తున్నారు. కరోనా అనుమానితుల జాడను పసిగట్టడానికి దక్షిణ కొరియా, సింగపూర్ ల మాదిరిగా భారత్ కూడా కొవిన్ 20, కరోనా కవచ్ అనే మొబైల్ యాప్ లను ప్రయోగించబోతోంది. మన కరోనా కేసుల్లో విదేశాల నుంచి తిరిగొచ్చిన భారతీయల సంఖ్యే అధికం. 

 

కరోనా పరీక్ష కిట్లకు తీవ్ర కొరత ఉండటంతో భారత్ భారీగా పరీక్షలను నిర్వహించలేకపోతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మైల్యాబ్ సంస్థ రూపొందించిన కొవిడ్ 19 రోగ నిర్ధారణ కిట్ కు ప్రభుత్వం వేగంగా అనుమతి ఇచ్చింది. వారానికి లక్ష కిట్ల చొప్పున తయారు చేయగలనని, తరవాత అవసరమైతే మరిన్ని కిట్లను అందించగలనని మైల్యాబ్ ప్రకటించింది. మైల్యాబ్ కిట్ తో పెద్ద లేబొరేటరీల్లో వెయ్యి నమూనాలను, చిన్న ల్యాబ్ లలో 200 నమూనాలనూ పరీక్షించవచ్చు అని అధికారులు తెలుపుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: