క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది. భారత్‌లోనూ కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 194 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 933కు చేరుకుంది. అలాగే కరోనా వైరస్‌తో దేశంలో ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. ఇదిలా ఉంటే.. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మొట్టమొదటిసారి ప్రధామంత్రి నరేంద్రమోదీ ఆదివారం(నేడు) దీనిపై మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించనున్న సంగ‌తి తెలిసిందే. 

 

ఆదివారం ఉదయం 11 గంటలకు తాను మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో కరోనా వైరస్ ప్రస్థుత స్థితి గురించి మాట్లాడుతానని మోదీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఆ టైమ్ రానే వ‌చ్చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో ప్రజలతో మాట్లాడుతున్నారు. కరోనాపై పోరులో భాగంగా లాక్‌డౌన్‌ వంటి అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనను క్షమించాలని వ్యాఖ్యానించారు. తనపై కొందరు ఆగ్రహంతో ఉన్నారని తనకు తెలుసని అన్నారు.

 

అయినప్పటికీ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ కఠిన చర్యలు తీసుకోకతప్పదని చెప్పారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నది జీవన్మరణ సమస్య అయినందువల్లే కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే ముఖ్యంగా పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  మోదీ గుర్తు చేశారు. అయితే వైరస్ వ్యాప్తి ప్రారంభమైన రోజుల్లో చర్యలు తీసుకుంటేనే కరోనాను తొలగించవచ్చని అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే దేశ ప్రజలు కొన్ని రోజులు లక్ష్మణ రేఖ దాటొద్దని వ్యాఖ్యానించారు. ఇలా మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో క‌రోనాపై ఫైటింగ్‌కు మోదీ ఆయ‌న మ‌న‌సులోని మాట‌లు వినిపించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: