కరోనా వైరస్ ప్రపంచానికే పరీక్ష పెడుతోంది. ఇళ్లల్లో ఉంటున్నా.... చర్యలకి కట్టుబడి ఉంటున్నా కూడా ఈ మహమ్మారి ఆటలు సాగిస్తూనే ఉన్నాయి. నిజంగా ప్రజలని వణికిస్తోంది ఈ కరోనా. ఈ మహమ్మారి బారిన పడిన దేశాలు వైద్య సహాయం లేక విలవిల్లాడుతున్నారు . కరోనా కోరల్లో చిక్కుకుని ఇటలీ సాయం లేక చింతిస్తుంటే క్యూబా డాక్టర్లు ఇటలీకి సహాయం అందించారు.

 

 

అగ్ర దేశాలు ఇటలీ ప్రజలకి ఏమీ చెయ్యలేక పోయినా క్యూబా మాత్రం చేతనైనది చేస్తామంటూ ఇటలీ చేరుకున్నారు . విజృంభిస్తున్న కరోనా వైరస్ వల్ల ఇటలీ, స్పెయిన్ తదితర దేశాలకి క్యూబా వైద్యులని పంపిస్తోంది . అయితే క్యూబా సేవ మాత్రం అమోఘం అనే చెప్పాలి. క్యూబా లో ఒకసారి అంటు  వ్యాధి వచ్చి వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఆ దేశానికి సాయం కూడా ఎవరు చెయ్యలేదు .

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :
 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
 
 
 

 

 

అప్పుడు ఆ దుస్థితి చూడలేక క్యూబా కమ్యూనిస్ట్ నేత వాళ్ళ దేశంలో డాక్టర్లని తయారు చేసాడు. అలానే అన్ని రకాల వ్యాధులకు పని చేసేలా ఒక వండర్ డ్రగ్ కూడా తయారు చేయించాడు. ఇప్పటికే మన కేరళలో కరోనా కేసులు ఎక్కువైపోయాయి. దీని వల్ల కట్టడి చెయ్యడం చాల కష్టం అయిపోతోందని కేరళ సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారు .

 

క్యూబా వండర్ డ్రగ్ ని కేరళకి దిగుమతి చేసుకోవాలని ఆమోదం తెలిపారు. అయితే ఈ డ్రగ్ ని దిగుమతి చేసుకోవాలంటే కేంద్రం ఆమోదించాలిట. క్యూబా ఒప్పుకున్నా కూడా కేంద్ర నిర్ణయం ముఖ్యం. క్యూబా నలభై ఏళ్ళ క్రితమే ఈ డ్రగ్ ని తయారు చేసిందట. కరోనా కి కూడా ఈ డ్రగ్ బాగా పని చేస్తుంది అని కూడా రుజువు అయ్యింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: