కరోనా వ్యాప్తి నేపథ్యంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఉదయం 11 గంటల నుండి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ 21 రోజులపాటు ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ని ప్రశాంతంగా పాటించాలంటూ... ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఇతరులకి ముప్పు చేకూరే అవకాశం ఉందని అన్నారు. మనమందరం కలిసికట్టుగా కరోనా పై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని, ఇంటి ముందు గీసుకున్న లక్ష్మణరేఖ ని ఎవరు దాట కూడదు అని... కఠిన చర్యలను పాటిస్తేనే కరోనా మహమ్మారిని అంతమోదించగలమని ఆయనన్నారు. వైరస్ తీవ్రత మన దేశ ప్రజలకు ఇంకా అర్థం కావడం లేదని... ఈ ప్రాణాంతక వైరస్ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని... కొన్ని రోజుల వ్యవధిలోనే లక్షల కిలోమీటర్ల దూరం సంక్రమించగలదని ఆయన చెప్పుకొచ్చారు.



ఆయన ఇంకా మాట్లాడుతూ... 'ఇప్పటివరకు కరోనా వైరస్ ని జయించిన వారే మనకు ఆదర్శవంతులు. కరోనా మహమ్మారి పై గెలిచిన ప్రతి ఒక్కరికి నేను సెల్యూట్ చేస్తున్నాను. వారంతా తమ అనుభవాన్ని సామాజిక మాధ్యమాలలో పంచుకుంటే అందరికీ ధైర్యంగా ఉంటుంది. అలాగే వైరస్ తీవ్రతని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని సోషల్ డిస్టెన్స్ ని పాటించాల్సిందిగా మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వైద్య, మౌలిక సదుపాయాల కోసం పీఎం కెర్స్ ఫండ్ ద్వారా మీకు చేతనైనంత సహాయం చేయండి'



'నేను మళ్లీ చెప్తున్నాను మీరు బయటకి రాకుండా ఇంట్లో ఉంటేనే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుంది. అందుకోసం మనకి కొంచెం క్లిష్టతరం అయినప్పటికీ భావితరాల కోసం ఇంటి నుండి బయటకు రాకుండా ఉందాం. నేను ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నన్ను క్షమించండి. కానీ లాక్ డౌన్ మాత్రం పాటించకపోతే ఇంతకంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు కరోనా వైరస్ ని అరికట్టేందుకు అవకాశాలు కూడా ఉండవు' అని ఆయన అన్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: