కరోనా ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా స్ప్రెడ్ అవుతోంది. దీన్ని ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. అంతే కాదు. రోజురోజుకూ దీని దూకుడు మరింతగా పెరుగుతోంది. ఇప్పుడు ఏకంగా ఆరు లక్షల మంది ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకి బాధపడుతున్నారు. ఇక మన ఇండియా ఈ విషయంలో కాస్త మెరుగే అయినా... కరోనాను ఇండియాలో కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కష్టపడుతున్నాయి.

 

 

అయితే ఇండియాలో కరోనా వైరస్ రెచ్చిపోకుండా ఉండేందుకు మన దేశం కూడా చైనా పద్దతినే ఫాలో అవుతోంది. వైరస్‌ ఉనికి పెరుగుతోందని భావించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ నిర్ణయంతో దేశానికి షాక్ ఇచ్చారు. కానీ చైనా 5.6 కోట్లున్న వుబెయ్‌ ప్రావిన్స్‌ను మాత్రమే లాక్‌డౌన్‌ చేసింది. దేశం మొత్తం కాదు. కానీ ఇండియా ముందు చూపుతో ఏకంగా దేశమంతటా లాక్ చేసి పడేసింది. చైనాలో జనవరి 23 నుంచి 81 వేల 340 కేసులు నమోదైతే... ఒక్క వుహాన్‌లోనే 68వేలు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 3 వేలు దాటింది.

 

 

అయినా సరే చైనా చక్కటి ప్లానింగ్ తో కరోనాను కట్టడి చేసింది. కరోనా తీవ్రతను తెలుసుకున్న వెంటనే ఆ దేశం వుహాన్‌కు లాక్ డౌన్ చేసేసింది జనాలను బయటకు రానివ్వకుండా చేసింది. వైరస్‌ గొలుసు తెంపేసింది. యుద్ధ ప్రాతిపదికన వైద్య సేవలు అందించింది. కిట్లు, పరికరాలు లేకపోతే అప్పటికప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. హుబెయ్‌ ప్రావిన్స్‌ లాక్‌డౌన్‌ అయినా ఆహార సరఫరా, -కామర్స్‌ సంస్థలు పనిచేసేలా చూసింది.

 

 

అంతే కాదు... వుహాన్‌ లో కరోనా కేసులు పెరిగినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వైద్యులను రప్పించింది. ఆర్మీని బరిలోకి దించింది. ఎక్కడికక్కడ తాత్కాలిక ఆస్పత్రులు కట్టేసింది. సామాజిక దూరం నిబంధనలు అమలు చేసింది. విజయం సాధించింది. ఇప్పుడు ఇండియా కూడా చైనా రూట్లోనే వెళ్తోంది. ఎంతవరకూ ఇండియా సక్సస్ అవుతుందో కొన్ని రోజుల్లో తేలుతుంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: