యావత్ భారత దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. మొత్తం లాక్ డౌన్ ప్రకటించటంతో పోలీసులు అందరూ రోడ్లపైనే కాపలా కాస్తున్నారు. దీంతో ప్రజలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. ఏదన్నా అవసరాల కోసం జనాలు బయటకు వచ్చినా కూడా ఓకే దగ్గర గుంపులు, గుంపులుగా ఉంటే పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

 

 అయితే.. కర్ఫ్యూను సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పోలీసులు అమలు చేస్తున్నారు. కానీ పోలీసుల తీరుపై అక్కడక్కడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఏ తప్పు లేకుండా అమాయక ప్రజలను అనవసరంగా లాఠీలతో దాడి చేస్తున్నారని సామాన్య ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఒకరిద్దరు పోలీసు అధికారులకు సస్పెన్షన్ ను విధించారు. అది చూసి కూడా  కొంతమంది పోలీసులు వారి తీరును మార్చుకోవడం లేదు. అనవసరంగా అమాయక ప్రజలపై లాఠీలు ఎత్తి వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు.  

 

 

అయితే.. ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్‌ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇతను నరసారావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతని పేరు ఎన్.హనుమంత చారి. ఈయన పోలీసులు నిర్వర్తిస్తున్న కర్ఫ్యూ లో భాగంగా గుండ్లపల్లి వెళ్లారు. వెళ్ళే మార్గంలో నరసింగపాడు గ్రామం దగ్గర పాల వ్యాపారి రోడ్డు పై కనిపించాడని.. మీరెందుకు బయట తిరుగుతున్నారని కోపంతో రగిలిపోయిన హనుమంతచారి ఆ పాల వ్యాపారిపై లాఠీతో దాడి చేశాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయమైంది ఇది చూసిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ కానిస్టేబుల్ పై నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

 

ఈ వ్యవహారం గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు దృష్టికి వెళ్లింది. దీంతో ఆ హెడ్ కానిస్టేబుల్ హనుమంత చారి తీరుపై మండిపడ్డాడు. దీంతో వెంటనే అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా., ఇటీవల పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ  దాడి చేసిన ఆ ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ ను విధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: