మన దేశంలో కరోనా వైరస్ తీవ్రత, క్రమ క్రమంగా పెరుతుతుండటం ఇప్పుడు అందరిలోనూ ఆందోళన మొదలయ్యింది. ఇప్పటివరకు ఇక్కడ కరోనా కేసుల సంఖ్య 1,000 దాటిపోయాయని సమాచారం. ఇక మరణాల సంఖ్యను గమనించినట్లయితే, గుజరాత్‌లో ఆదివారం, అనగా ఈరోజు ఉదయం మరో వ్యక్తి ప్రాణాలను కబళించింది ఈ కరోనా మహమ్మారి. దీనితో కలిపి మొత్తం మరణాల సంఖ్య మనకు 26 గా తెలుస్తోంది.

 

ఇక ముందు ముందు కరోనా కేసుల సంఖ్య, వేలను దాటి, లక్షలకు చేరతుందేమోననే ఆందోళన అందరిలోనూ వుంది. ఇక ఆ మహా ప్రళయాన్ని అడ్డుకోవాలంటే.. ఇపుడు దక్షిణ కొరియా మాదిరి ‘టీ 3’ ట్రేస్‌, టెస్ట్‌, ట్రీట్‌ (ఆచూకీ, పరీక్ష, చికిత్స) మార్గాన్ని అనుసరించాలని ఇక్కడి ఆరోగ్య నిపుణులు, కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టుగా తాజా సమాచారం. కేంద్రం కూడా ఆ దిశగా చర్యలను చేపట్టే అవకాశం వుంది.

 

ఇక కొత్తగా కలవర పెడుతున్న విషయం ఏమంటే, కరోనా వైరస్ బాధితులు, చిక్సిత్స అనంతరం..  కోలుకున్న తర్వాత కూడా వారి నుంచి కోవిడ్-19 సంక్రమించే అవకాశం లేకపోలేదని పరిశోధనలో తేట తెల్లమైంది. సదరు బాధితుడు కోలుకున్న ఎనిమిది రోజుల వరకూ వారిలో కరోనా వైరస్ నిర్జీవంగా  ఉంటుందని.. అమెరికాలోని యేల్ యూనివర్సిటీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసినదే.

 

ఇక పెద్దన్న అమెరికా కరోనా దెబ్బకు కొట్టుమిట్టాడుతోంది. తాజా లెక్కల ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు ఆ ఇక్కడే నమోదు కావడం విశేషం. ప్రస్తుత లెక్కల ప్రకారం అక్కడ పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. అక్కడి ప్రభావం తీవ్రంగా ఉన్న సిటీస్... న్యూ యార్క్, న్యూ జెర్సీ సమీప ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకి రావాలంటేనే భయపడిన పరిస్థితి. అమెరికాలో ఇప్పటివరకు 1929 మరణాలు సంభవించాయని తెలుస్తోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: