చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు అమెరితో సహా ప్రపంచాన్ని వణిస్తోంది. అనేక దేశాలు గడగడలాడుతున్నాయి కరోనా దెబ్బతో.. అయితే దీన్ని పుట్టించిన చైనా మాత్రం ఇప్పుడు టెన్షన్ ఫ్రీగా ఉంది. ఎందుకంటే ఆ దేశం సమర్థ వంతంగా కరోనా కట్టడిని అదుపు చేయగలిగారు. ఇప్పుడు చైనాలో సీన్ పూర్తిగా మారిపోయింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలోపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌లు పాటిస్తుంటే వైరస్‌ జన్మస్థానమైన వూహాన్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

 

 

కరోనాను కట్టడి చేసేందుకు రెండు నెలల కిందట అక్కడ చైనా లాక్‌డౌన్ విధించింది. తాజాగా శనివారం ఆంక్షలు ఎత్తివేసింది. అధికారికంగా మంజూరు చేసిన తొలి ప్రయాణీకుల రైలు శుక్రవారం అర్ధరాత్రి నగరంలోకి ప్రవేశించింది.ఇన్నాళ్లు అక్కడ నిర్బంధంలో మగ్గిన ఇతర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా బయటికి రావడంతో తీవ్ర కోలాహలం ఏర్పడింది. షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్లు తిరిగి ప్రారంభం కావడంతో ప్రజలు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు.

 

 

మరి ఇక్కడ చైనా మాత్రం ఎలా కరోనా కట్టడిని అడ్డుగోగలిగింది. వాళ్లు వేసిన మంత్రం ఏంటో తెలుసా.. లాక్ డౌన్‌, సామాజిక దూరం వంటివి మాత్రమే. ఆధునిక సౌకర్యాలు శరవేగంగా అందించగలగడం కూడా ప్రాణ నష్టాన్ని నివారించింది. అయితే అందరికీ అర్థం కానిది ఒకే ఒక్క సంగతి. తక్కువ జనాభా గల ఐరోపా దేశాలన్నీ లాక్‌డౌన్‌ ప్రకటిస్తే వుహాన్‌కు మాత్రమే తాళమేసి మిగతా రాష్ట్రాల్లో వైరస్‌ను చైనా ఎలా కట్టడి చేసిందా అని.

 

 

ఈ సమాధానం కోసం ప్రపంచం వెదుకుతోంది. కానీ ఈ సీక్రెట్ చాలా చిన్నది. సామాజిక దూరం, లాక్‌ డౌన్ వంటి విధానాలే చైనాను గెలిపించాయని.. అవే రేపు ఇండియాను కూడా గెలిపిస్తారని విశ్లేషణలు చెబుతున్నాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: