అమెరికా, యూరప్ దేశాల మాదిరి ఇండియాలోనూ కరోనా వైరస్ మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతున్నదని, ఇప్పటికే మన దేశం  స్టేజ్-3లోకి ప్రవేశించినట్లేనని రిపోర్టులు రావడంతో జనం ఒక్కసారిగా ఉలికకిపడ్డారు. భారతదేశమంతా లాక్‌‌డౌన్ ప్రకటించినా రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చాలా చోట్ల లాక్ డౌన్ ను సరిగ్గా పాటించకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 931కి చేరింది. వీరు కాకుండా విదేశీయులు 47 మంది ఉన్నారు. ఇప్పటివరకూ 87 మంది కరోనా వ్యాధి తగ్గి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా దేశంలో ఇప్పటికే మృతుల సంఖ్య 25కి చేరింది. ఎంత కట్టడి చేయాలనీ చూసినా, ఈ మహమ్మారి అంతకు మించి ఆగకుండా వ్యాపిస్తూనే ఉంది.   ప్రజలను ఇళ్ల నుండి రావొద్దని చెప్పినా, బయటకు వస్తున్నారని సామజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది.

 

 

నిన్న సాయంత్రం 870కి పైగా కేసులు నమోదుకాగా, ఈ ఉదయానికి పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 931కి పెరిగింది.  ఇక మహారాష్ట్రలో అత్యధికంగా 186 కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు. ఆపై రెండో స్థానంలో నిలిచిన కేరళలో 182 మందికి వ్యాధి సోకగా, ఒకరు మరణించారు. కర్ణాటకలో 81, తెలంగాణలో 67, ఉత్తర ప్రదేశ్ లో 55, గుజరాత్ లో 55, రాజస్థాన్ లో 54, ఢిల్లీలో 39, తమిళనాడులో 42, మధ్యప్రదేశ్ లో 30, పంజాబ్ లో 38, హర్యానాలో 33, ఆంధ్రప్రదేశ్ లో 14, లఢక్ లో 13, జమ్ము కశ్మీర్ లో 33, బెంగాల్ లో 17, బీహార్ లో 9, అండమాన్ నికోబార్ లో 9, హిమాచల్ ప్రదేశ్ లో 3, గోవాలో 3, పుదుచ్చేరి లో 1, ఒడిశాలో 3 కేసులు నమోదయ్యాయి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: