ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ కరోనా విషయంలో చైనా కుట్రను బట్టబయలు చేశారు. కరోనా వైరస్ ను చైనా కావాలని వ్యాప్తిలోకి తెచ్చిందని చాలా మంది నమ్ముతున్నారని ఈ విషయాన్ని తాను కూడా నమ్ముతున్నానని కేఏ పాల్ చెప్పారు. చైనా వుహాన్ లో కరోనా వైరస్ ను తయారు చేసి వైరస్ సోకిన రోగులను ఇతర దేశాలకు పంపించి వ్యాధి వ్యాప్తికి కారణమైందని విమర్శలు చేశారు. 
 
అమెరికాకు మద్దతు ఇస్తున్న దేశాలలో, యూరోపియన్ దేశాలలో, ధనిక దేశాలలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందని చెప్పారు. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలలో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందిందని అన్నారు. ప్రజలు రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండటం వల్లే పోలీసులు కొడుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇతరులకు కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలని లేకపోతే కరోనా సోకిన వారి నుండి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని తెలిపారు. 
 
కరోనా భారీన పడి ధనిక దేశాలలో వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారని.... ఆ దేశాలతో పోలిస్తే మన దేశం పేద దేశం, మందులు, వ్యాక్సిన్ల కొరత ఉన్న దేశం కాబట్టి మన దేశం మరింత ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ, పోలీస్, చట్టాల నిబంధనలు ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ప్రభుత్వం మూడు వారాలు లాక్ డౌన్ విధించిందని... ఈ వ్యాధి నివారణకు కనీసం ఆరు వారాలు పట్టే అవకాశం ఉందని చెప్పారు. 
 
కనీసం ఆరు వారాల పాటు కఠిన చర్యలు తీసుకుంటూ... కఠిన నిబంధనలను అమలు చేస్తే కొన్ని వందల మంది చనిపోతారని... లేదంటే మాత్రం లక్షల సంఖ్యలో చనిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా వల్ల దేశంలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని... ఏప్రిల్ 12లోపు అమెరికాలో ఇటలీ కంటే ఎక్కువ మంది కరోనా వల్ల మృతి చెందే అవకాశం ఉందని చెప్పారు. అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి పని చేస్తే కరోనాను నివారించవచ్చని తెలిపారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: