ప్ర‌పంచాన్ని క‌బ‌లించేస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఎవ్వ‌రిని వ‌ద‌ల‌డం లేదు. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 30 వేల మందిని బ‌లి తీసుకున్న క‌రోనా వైర‌స్ ఇప్పుడు ఏకంగా ఓ దేశ మ‌హారాణినే బ‌లి తీసుకుంది. క‌రోనా దెబ్బ‌తో ఆదివారం స్పెయిన్ రాణి మ‌రియా థెరిసా (86) మృతి చెందారు. ఫ్రాన్స్ రాజ‌ధాని ప్యారీస్‌లో క్వీన్ మారియా థెరిసా మృతి చెందిన‌ట్టు ఆమె కుటుంబ స‌భ్యులు ధృవీక‌రించారు. ఇక ఇప్ప‌టికే స్పెయిన్‌లో క‌రోనా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

యూర‌ప్‌లో క‌రోనా కోర‌లు చాస్తోన్న దేశాల్లో స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్ ఉన్నాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం సామాన్యుల‌ను బ‌లి తీసుకున్న ఈ వైర‌స్ దెబ్బ‌తో ఇప్పుడు ఏకంగా మ‌హారాణి సైతం ప్రాణాలు కోల్పోక త‌ప్ప‌లేదు. ఇక యూర‌ప్లో ఇట‌లీ, స్పెయిన్ లాంటి దేశాల్లో ఎక్కువ క‌రోనా మ‌ర‌ణాలు చోటు చేసుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆ దేశ‌ల్లో ఉన్న వృద్ధులే అంటున్నారు. అప్ప‌టికే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఉన్న వృద్ధుల‌కు క‌రోనా సోక‌డంతో ఎక్కువ మంది చ‌నిపోతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: