క‌రోనాపై ఏపీ ప్ర‌భుత్వం ఆదివారం మ‌ధ్యాహ్నం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. క‌రోనాపై ఆదివారం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. ఇక లాక్‌డౌన్‌, క‌రోనా.. ఇంటింటికి రేష‌న్ పంపిణీపై చ‌ర్చించారు. క‌రోనాను ఎలా క‌ట్ట‌డి చేయాలో చ‌ర్చించు కున్నారు. ఇక ఈ స‌మావేశానికి మంత్రులు ఆళ్ల నాని, బొత్స స‌త్య‌నారాయ‌ణ, బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, కుర‌సాల క‌న్న‌బాబు.. హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత హాజ‌రయ్యారు. 

 

క‌రోనా క‌ట్ట‌డికి ఏపీ ప్ర‌భుత్వం వేసిన ప్ర‌త్యేక‌మైన క‌మిటీలో ఈ ఐదుగురు మంత్రులు స‌భ్యులుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక జ‌గ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్లు.. వైద్యాధికారుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. లాక్‌డౌన్ విష‌యంలో సీరియ‌స్‌గా దృష్టి పెట్టాల‌ని క‌లెక్ట‌ర్లు, డీఎంహెచ్‌వోల‌కు ఆదేశించారు. ఇక ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 512 మందికి క‌రోనా టెస్టులు చేశారు. వీరిలో 433 మందికి నెగిటివ్ వ‌చ్చింది. ఇక మ‌రో 60 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.

 

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో మొత్తం 19 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఏపీలో ప‌రిణామాల‌పై సంతోష‌క‌ర‌మైన వార్త ఏంటంటే గ‌త రాత్రి నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా న‌మోదు కాలేదు. నిన్న న‌మోదు కేసులు మాత్ర‌మే ఈ రోజు కూడా కొన‌సాగుతున్నాయి. ఇక ఏపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఈ నెల 14వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ ప్రోగ్రామ్ చాలా స్ట్రిక్ట్‌గా అమ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: