ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన ఓ కీల‌క వ్య‌వ‌స్థ ఇప్పుడు ఏకంగా ఎల్లలు దాటేస్తోంది. ఈ వ్య‌వ‌స్థ‌ను ఇప్ప‌టికే మ‌న దేశంలో ప‌లు రాష్ట్రాలు పాటించాల‌ని చూస్తుండ‌గా ఇప్పుడు ఏకంగా అది విదేశాల‌కు కూడా పాకింది. సీఎం జ‌గ‌న్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఈ ప‌థ‌కంతో పాటు గ్రామ స‌చివాల‌యం ఎలా అమ‌లు అవుతోందో ఇప్ప‌టికే ఇత‌ర రాష్ట్రాలు కూడా ఆరా తీస్తున్నాయి. 

 

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ఏకంగా ల‌క్ష‌ల్లో వలంటీర్ల‌ను నియ‌మించుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే ఈ రోజు అదే వాలంటీర్లు ఏపీలో క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో త‌మ వంతుగా కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌తి గ్రామంలోనూ.. ప్ర‌తి ఇంటికి వెళ్లి క‌రోనా గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు క్వారంటైన్ విష‌యంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అలాగే మందులు పంపిణీ.. రేష‌న్ పంపిణీ లాంటి విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

 

ఇక ఇప్పుడు ఇదే వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను మ‌న‌దేశంలో కేర‌ళ‌తో పాటు బ్రిట‌న్ సైతం అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో అనుసరిస్తున్న వాలంటీర్ల వ్యవస్థను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నిర్ణయించారు. మహమ్మారి కరోనా వైరస్‌ కేరళపై తీవ్ర ప్రభావం చూపుతోన్న తరుణంలో  ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక బ్రిటన్‌లో ఇప్పటికే 2 లక్షల 80 వేల గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేశారు. వీరందరిని కరోనాపై పోరుకు సహాయకులుగా ఉపయోగించుకోనున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: