ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా 30 వేల మంది రోగులు చనిపోగా... అందులోని పదివేల మంది ఇటలీలోనే మరణించారు. అయితే అమెరికాలో మాత్రం ఏ దేశంలో లేని ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1, 21, 000 ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. చైనా, ఇటలీ దేశాలలో కూడా ఇంతవరకు అన్ని కేసులు నమోదు కాలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుందని అక్కడి ప్రభుత్వ అధికారులు తాజాగా తెలియజేశారు.



ఇటీవల లౌసియానా జైలు లో పాట్రిక్ జోన్స్ అనే ఓ 49 ఏళ్ళ నేరగాడు కోవిడ్ 19 వ్యాధి లక్షణాలతో చనిపోయాడు. దాంతో ఇతర నేరగాళ్లకు కూడా వైరస్ సంక్రమించిందని జైలు భావిస్తున్నారు. ఓ విస్తుపోయే నిజం గురించి తెలుసుకుంటే... అమెరికా దేశంలో శుక్రవారం వరకు సుమారు 1000 కేసులు నమోదు కాగా... ఈరోజు లోపు ఆ సంఖ్య రెట్టింపు అనగా 2000 చేరుకుంది. దాంతో అమెరికా ఇప్పుడు అత్యధిక కరోనా మరణాల జాబితాలో 6 వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఇటలీ ఉండగా రెండవ స్థానంలో స్పెయిన్, మూడవ స్థానంలో చైనా, నాలుగవ స్థానంలో ఇరాన్, ఐదవ స్థానంలో ఫ్రాన్స్ ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్యలో అమెరికా మొదటి ప్లేస్ లో ఉండగా, ఇటలీ రెండవ స్థానంలో, చైనా మూడవ స్థానంలో ఉంది.



అమెరికా లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ వేలల్లో పెరిగిపోతుండటంతో ఆ దేశ శాస్త్రవేత్తలు కరోనా టెస్ట్ లు త్వరగా చేయాలని ఉద్దేశంతో అత్యాధునిక టెక్నాలజీ కనిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోని భాగంగానే అబ్బోట్ నో అనే ఓ ప్రముఖ సంస్థ తయారుచేసిన ఓ పోర్ట్రబుల్ పరికరం ద్వారా రోజుకి 50 వేల కరోనా టెస్టులు చేయొచ్చట. అయితే ఈ టెస్టింగ్ పరికరాలు కొన్ని రోజుల్లోనే అన్ని ఆసుపత్రి లకు పంపిణి చేయబడతాని తెలుస్తుంది. అలాగే అగ్రరాజ్యం కొత్తగా తయారు చేసి కరోనా విరుగుడు మందులు రోగులని తక్కువ సమయంలోనే నయం చేయగలవని ఆ దేశ వైద్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :



NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.



Google: https://tinyurl.com/NIHWNgoogle



Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: