ప్రపంచం మొత్తానికి చుక్కలు చూపిస్తున్న కరోనా కే చుక్కలు చూపించే మందు కనిపెట్టారు. అయితే ఈ మందు ఇప్పుడు కనిపెట్టింది కాదు గతంలోనే ఓ దేశం కనిపెట్టింది. దాని పేరు ఆల్ఫా-2బి. ఈ వార్త వింటే గుండెలపై ఉంచిన 100కేజీల బరువు ఒక్క సారిగా దించేసినట్టు ఉంది కదూ..అవును నిజమే ఈ మందుతో నే చైనా మరణాల సంఖ్యని పెంచుకోకుండా నిలువరించ గలిగింది. ఈ మందు ఇప్పుడు ఇటలీ లో మృత్యువు వడిలోకి వెళ్తున్న ఎంతో మంది కరోనా వైరస్ భాదితులని బయటకి పడేయగలిగింది...మరి ఈ వ్యాక్సిన్ మనమూ వాడచ్చు కదా అనే సందేహం మీకు వచ్చింది కదూ...కరక్టే...మ్యాటర్ లోకి వెళ్దాం 

IHG
కరోనా లాంటి ఉపద్రవం నుంచీ గట్టేకించేలా మందుని కనిపెట్టింది ఎవరో కాదు క్యూబా. అమెరికా అహంకారానికి అణిచివేయబడుతున్న దేశం. అయినా ఎక్కడా తలోగ్గని ఎదురులేని దేశం. ఎంతైనా చేగువేరా , ఫిడేల్ క్యాస్ట్రో స్పూర్తి కలిగిన దేశాలు కదా అలాగే ఉంటాయి. సరే అసలు విషయంలోకి వెళ్తే.. కరోనా దెబ్బకి అందరూ ఇళ్లకే పరిమితమై పోతుంటే క్యూబా మాత్రం తమ సేవలు అందుకోండి అంటూ 38 దేశాలకి కరోనాని అంతం చేయడానికి వెళ్ళింది. ప్రపంచంలోనే వైద్యులని ఉత్పత్తి చేసే దేశంగా పేరొందిన క్యూబా ఎంతో కీర్తిని గడించింది. కరోనా కాదు కదా దాని అమ్మమ్మ వచ్చినా ఆ వైద్యులు సమర్ధవంతంగా ఎదుర్కోగలరు.

IHG

క్యూబా వైద్యులు కరోనా కోసం సుమారు 30 ఏళ్ళ క్రితమే ఓ మందుని తయారు చేసుకుంది. దానిపేరు “ఇంటర్ ఫెరాన్ ఆల్ఫా-2బి”. కరోనాపై ఈ మందు ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందట. వ్యాధి తీవ్రత ఎలాగున్నా సరే కట్టడి చేయడంలో దీనికి మించింది లేదనేది వాస్తవం. కరోనా చైనా పై ఎటాక్ చేసిన సమయంలో క్యూబా సాయం కోరగా వారికి తమ వైద్యులు కొందరితో పాటు ఆల్ఫా 2బి మెడిసిన్ కూడా అందించారు. ఫలితంగా పెద్ద ఉపద్రవం నుంచీ చైనా బయటపడింది.  ప్రస్తుతం మాకు ఆ మందు ఇవ్వండి అంటే మాకు ఇవ్వండి అంటూ సుమారు 20 దేశాలు క్యూబా తో సంప్రదింపులు జరుపుతున్నాయి...

IHG

కేరళా సైతం క్యూబా మందు కావాలని సాయం అడిగింది. క్యూబా అయితే సరే అంది కేరళా ముఖ్యమంత్రి సైతం ఈ విషయంపై మాట్లాడుతూ అందుకు కేంద్రం అనుమతి కావాలి, డ్రగ్స్ కంట్రోల్ అనుమతులు కావాలి ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లానని విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై నోరు మెదపడంలేదు ప్రపంచం మొత్తాన్ని కరోనా నుంచీ బయటపడేస్తున్న ఈ మందు వైపు మనవాళ్ళు ఎందుకు దృష్టి పెట్టడంలేదు అనేది లక్ష డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది...  

  
 

మరింత సమాచారం తెలుసుకోండి: