కరోనా వైరస్ ను అదుపుచేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. దీంతో ఆపదలో ఉన్న వారికి సైబరాబాద్ పోలీసులు సహాయం చేస్తున్నారు. కరోనా వ్యాపించకుండా లాక్ డౌన్ ప్రకటించటంతో రకరకాల సమస్యలు సామాన్య ప్రజలు ఎదుర్కుంటున్నారు. ఇందుకోసం అని సైబరాబాద్ పోలీసులు కమిషనర్ కమిషనరేట్ లో వీసీ సజ్జనార్ సూచనల మేరకు కోవిడ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అయితే.. దీనికి  ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందట.

 

ఇందుకు గాను కంట్రోల్ రూమ్ లో డీసీపీ ట్రాఫిక్ ఎస్ఎమ్ విజయ్ కుమార్ నేతృత్వంలో ఒక అడిషనల్ డీసీపీ, ముగ్గురు ఇన్‌ స్పెక్టర్లు, మరో ముగ్గురు సబ్ ఇన్‌ స్పెక్టర్లు, తొమ్మిది మంది పోలీస్ కానిస్టేబుళ్లు 24 X 7 పని చేస్తున్నారు. ఈ కంట్రోల్ రూమ్ కు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన, కరోనా వైరస్ పై సమాచారం ఇవ్వాలన్నా, ఇంకా ఫిర్యాదు చేయాలన్నా, సామజిక దూరం పాటించకపోయిన, అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులకు, మెడికల్ ఎమర్జెన్సీ సేవలు, ఇంటి వద్ద క్వారంటైన్ నిబంధనలు పాటించకపోయినా ఇంకా ఏ ఇతర సమస్యలపైనా కూడా ఈ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు. కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 9490617440, 9490617431 లను సంప్రదించవచ్చు. కాగా., ఈ నెంబర్లకు వాట్సాప్ సదుపాయం కూడా ఉంది. అలాగే ఈ మెయిల్ covidcontrol@gmail.com కూడా అందుబాటులో ఉంది. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వీసీ సజ్జనార్ హైదరాబాద్ ప్రజలను కోరారు.


కంట్రోల్ రూం ద్వారా ప్రజలకు అందిన సేవల్లో కొన్నిటిని చూద్దాం.. సైబరాబాద్ పరిధిలోని అనాథలు, నిరాశ్రయులు, పేదలు, ఆకలితో ఉన్న వారిని గుర్తించి రాబిన్ హుడ్ ఆర్మీ, వివిధ స్వచ్ఛంద సంస్థల సాయంతో రోజుకు సుమారు 1000మంది వరకూ ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కి వచ్చిన సమాచారం మేరకు 8 మంది పేషంట్లను అంబులెన్స్ ద్వారా డయాలసిస్‌కు తరలించారు. హాస్టళ్ల నిర్వహణ, యాజమాన్యాల తీరుపై వచ్చిన 5 ఫిర్యాదులను పరిష్కరించారు. కరోనా వచ్చిన 7 గురు అనుమానితులను వైద్య పరీక్షల నిమితం క్వారంటైన్ కు తరలించడం జరిగింది. ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల పై జనం తిరగకుండా చూడటం, గ్యాస్ సిలిండర్ సమస్యలు, తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 56 ఫిర్యాదులను సంబంధిత అధికారులకు తెలియజేయడం. ప్రెగ్నెంట్ మహిళలను అంబులెన్సులో ఆసుపత్రులకు తరలించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: