అమ్మా రావొద్దు అంటే వినట్లేదు, అయ్యా రావోద్దంటే వినట్లేదు. పిల్లలకు హగ్గీస్ లేదని ఒకడు, పరవన్నం చేసుకోవడానికి పాలు తగ్గాయని ఒకడు, పలావ్ చేసుకోవడానికి దినుసులు లేవని ఒకడు, భార్యకు మల్లె పూల కోసం మరొకడు, రావొద్దు రా సామి చస్తారు అని చెప్పినా ఎవరూ కూడా వినట్లేదు. వస్తే చస్తారు అంటే ఎన్ని చూడలేదు అని ఒకడు మాట్లాడటం. బోర్ కొడుతుందని బయటకు రావడం. 

 

కొట్టినా వినడం లేదు తిట్టినా వినడం లేదు. మర్యాదగా చెప్పినా వినడం లేదు బుజ్జగించినా వినడం లేదు. ఆకలి కేకలు ఉన్న వాడు కూడా బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటుంటే అన్నీ ఉన్న వాడు కూడా ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తున్నాడు. లాక్ డౌన్ ప్రకటించడం అనేది ఎంత కఠిన స్థితో అర్ధం కావడం లేదు ఎవరికి. తంతే తన్నారు, తిడితే తిట్టారు అనడమే గాని ఇంట్లో మాత్రం ఎవరూ ఉండటం లేదు. దీనితో ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. 

 

పని లేని పనికి అవసరం లేని అవసరానికి బయటకు వస్తున్న వాళ్ళ భరతం పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కొడితే తిడుతున్నారని బండి నెంబర్ రిజిస్టర్ చేసుకుని బండిని సీజ్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. మూడు కమీషనరేట్ ల పరిధిలో కూడా ఈ బండి నెంబర్ లో ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తారు. మూడు కిలోమీటర్లు దాటి బండి బయట తిరిగితే ఆ బండి పార్ట్ లు పీకి అమ్ముకోవడమే. దీనికి మించిన లాభం లేదని భావిస్తున్నారు. ఆదివారం నుంచి వాహనాలకు నిఘా పెట్టనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: