దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటంచిన విషయం తెలిసిందే.   చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ కరోనా పట్టి పీడిస్తుంది.  ఇప్పటికే దేశ వ్యాప్తంగా 900 కేసులు దాటాయి.. ఇరవై మంది చనిపోయారు.  ప్రపంచం మొత్తం ఈ కరోనాతో వణికి పోతున్నారు.  మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ ఎంత భయం పుట్టిస్తున్నా కూడా ఇంకా ప్రజలు బయట తీరుగుతూనే కనిపిస్తున్నారు.  కొన్ని చోట్ల లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు.  

 

తొటి ప్రజల కోసం ఓ పాతిక రోజులు బయటకు రాకుండా ఉండలేకపో తున్నారు ప్రజలు. పోలీసులు ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా రోడ్ల మీద జనం మాత్రం విపరీతంగా కనిపిస్తున్నారు.  మన తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు కూడా బయట తిరిగితే అక్కడక్కడ కొట్టడం తప్పితే అర్థం అయ్యేలా చెప్పట్లేదు.. ఇదిలా ఉంటే రాజస్తాన్‌ అధికారులు మాత్రం ఇంటి నుంచి బయటకు వస్తే వినూత్న శిక్ష విధిస్తున్నారు. రోడ్లపైకి వచ్చేవారిని అరెస్టు చేయడం, లాఠీలతో కొట్టడం చేయరాదని నిర్ణయించుకున్నారు.

 

లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిని జేజేటీ వర్సిటీ, సింఘానియా వర్సిటీల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో రోగులకు సేవలు అందించేందుకు పంపిస్తున్నారు. ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఎక్కవగా కనిపిస్తుంది. రోడ్లపై చిల్లరగా తిరిగే వారిని గుర్తించి మాకు ఫొటోలు పంపితే, అధికారులు వారిని గుర్తించి క్వారంటైన్‌లలో సేవలకు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: