కరోనా వైరస్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ భారీన పడి ప్రపంచవ్యాప్తంగా 30,000 మందికి పైగా మృతి చెందారు. రోజురోజుకు మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా వైరస్ చైనా కుట్రే అని ఇప్పటికే వివిధ దేశాల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనాను కట్టడి చేయడంలో విఫలమవుతోంది. 
 
కరోనా సోకకుండా  WHO సలహాలు, సూచనలు ఇస్తున్నప్పటికీ కరోనాను నివారించడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. కరోనా విషయంలో WHO కొంత నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు విశ్లేషకులు చైనా WHO ను గుప్పిట్లో పెట్టుకుందని... అందువల్లే కరోనా విషయంలో WHO కొంత ఆలసత్వం వహిస్తుందని అభిప్రాయపడుతున్నారు. చైనా కుట్రలో WHO కూడా భాగస్వామి అయిందని ఆరోపణలు చేస్తున్నారు. 
 
చైనాలోని వుహాన్ నగరం నుంచి పుట్టుకొచ్చిన ఈ వైరస్ చైనా మొదలుపెట్టిన బయోవార్ అని కూడా ప్రచారం జరుగుతోంది. అమెరికా గతంలో కరోనా వైరస్ ను వుహాన్ వైరస్ అంటూ విమర్శలు చేసింది. కరోనా వైరస్ వల్ల ఇటలీ, అమెరికా, స్పెయిన్ లో వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాకు మందు లేకపోవడంతో ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. 
 
జంతువుల మాంసం నుంచే ఈ వైరస్ సోకిందని తెలిసినప్పటికీ ఈ వైరస్ మూలం గురించి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్నా WHO నుంచి సరైన స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చైనా ఇప్పటికే కరోనాకు మందు కనిపెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఈ కరోనా వైరస్ చుట్టూ అనేక సందేహాలు, అనేక ఆరోపణలు, అనేక వదంతులు ఉండటంతో ఈ వైరస్ విషయంలో అసలు నిజాలు తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: