ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు కరోనాతో యుద్దం చేస్తున్నాయి.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా ప్రస్తుతం దేశాలన్నీ చుట్టేస్తుంది.  ప్రతిరోజూ కరోనా పై వార్తలు చూస్తున్న జనాల్లో భయాందోళన పెరిగిపోతుంది.  ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ధైర్యాన్ని నింపేందుకు మన్ కీ బాత్ లో మాట్లాడారు.  కరోనాపై పోరులో భాగంగా లాక్‌డౌన్‌ వంటి అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తనను క్షమించాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మిగతా ప్రపంచంతో పాటు ఇండియా కూడా ఓ ప్రాణాంతక మహమ్మారితో జీవన్మరణ పోరాటం సాగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

 

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పేదలు, వ్యాపారవేత్తలు, డాక్టర్లతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. కరోనా విలయతాండవం సృష్టిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మనో నిబ్బరాన్ని వదలరాదని పిలుపునిచ్చారు.  తనపై కొందరు ఆగ్రహంతో ఉన్నారని తనకు తెలుసని అన్నారు. అయినప్పటికీ, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఈ కఠిన చర్యలు తీసుకోకతప్పదని చెప్పారు. తాను సూచించినట్టుగా 15వ తేదీ వరకూ ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ను పాటించాలని, ఏ పేదకూ అన్న పానీయాలకు లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసాను ఇచ్చారు. 

 

ఎటువంటి భయాలూ పెట్టుకోవద్దని, ఎవరికైనా జలుబు, జ్వరం, ఊపిరి ఇబ్బంది వంటి కరోనా లక్షణాలు కనిపిస్తే, వైద్యాధికారులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. రోజువారీ కూలీలు, పేదలు పడుతున్న బాధలను ఆ స్థాయి నుంచే వచ్చిన తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ప్రభుత్వాలు ఉన్నది ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకునేందుకేనని తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటిస్తే, సాధ్యమైనంత త్వరలోనే పరిస్థితి సద్దుమణుగుతుందని, సాధారణ స్థితి వస్తుందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కష్టం వచ్చింది.. అందరై దైర్యంతో ఎదురు నిలిచి పోరాడాలి... తర్వాత మనకు మంచి రోజులు వస్తాయని అన్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: