దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సానికి లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నేపథ్యంలో ఇరు ముఖ్యమంత్రులు ప్రజల ఇబ్బందులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికార, నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.  తాజాగా ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వ్యవసాయ కూలీల రాకపోకలను నిరాకరించవద్దని సీఎం ఆదేశించారని తెలిపారు.  రాష్ట్రంలో మొబైల్ మార్కెట్లు పెంచాలని సీఎం స్పష్టం చేశారని, నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువ ధరకు అమ్మితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. 

 

వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోకుండా గిట్టుబాటు ధరలు అందించేలా చర్యలు ఉంటాయని అన్నారు.   అంతేకాకుండా, మంత్రి ఆక్వారంగంపైనా స్పందించారు. రాష్ట్రంలో చేపలు, రొయ్యలు లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయని, ఎంపెడాతో కలిసి రొయ్యల కొనుగోలుకు నిర్ణయించిన ధరకు కొనాలని స్పష్టం చేశారు.​  కూలీలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ​ అక్వా రంగంలో 50 శాతం మంది కూలీలను అనుమతించాలని   ప్రతి ఒక్కరూ తమ సెఫ్టీ గురించి ఆలోచించుకోవాలని అంటున్నారు.  నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే చర్యలు తప్పవని హెచ్చరిక చేశారు. 

 

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు నుంచి రేషన్ అమలు చేయబోతున్నారు.  రేషన్ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి మొదలు పెట్టి నాలుగు దఫాలుగా రేషన్ అందజేయబోతున్నారు.  మొదటి విడదట రేషన్ ను ఈరోజు ఇవ్వబోతున్నారు.  ఉదయం నుంచి ఈ రేషన్ కోసం రేషన్ షాపుల వద్ద పెద్ద క్యూ లైన్లు ఉండటం విశేషం.  రెండో విడత రేషన్ ఏప్రిల్ 5 న, మూడో విడత ఏప్రిల్ 15 వ తేదీన, నాలుగో విడత ఏప్రిల్ 29 వ తేదీన ఇవ్వబోతున్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 


apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: