క‌రోనా దెబ్బ‌తో రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు వ‌ణికి పోతున్నారు. ఇక ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో క‌రోనా పాజిటివ్ కేసులు రావ‌డంతో ఆ జిల్లాలో ఒక్క‌సారిగా హై ఎలెర్ట్ ప్ర‌క‌టించారు. ఒంగోలు నగరంలోని ఓ యువకునికి తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఒంగోలులో చికిత్స పొందుతోన్న‌న ఓ ముస్లిం మ‌త‌పెద్ద‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో జిల్లాలో తీవ్ర ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక పాజిటివ్ కేసులు న‌మోదు అయిన వ్య‌క్తి నివాసం ఉంటోన్న చీరాల ప్రాంతాల‌ను పోలీసులు హైరిస్క్‌ జోన్‌లుగా ప్రకటించి నివారణ చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జిల్లాలో ప్రజలు స్వీయ నియంత్రణే ఆయుధంగా తీసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రిస్తున్నారు.

 

ఇక ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా 19 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇందులో వైజాగ్‌, గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు చెందిన వారే ఎక్కువుగా ఉన్నారు. ఇక చీరాల‌లో సాల్మన్‌ సెంటర్‌ పంచాయతీలోని నవాబుపేటలో గురువారం రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. నవాబుపేటకు చెందిన భార్య, భర్తలకు కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడంతో వారికి ప‌రీక్ష‌లు చేయ‌గా వారికి క‌రోనా ఉన్న‌ట్టు తేలింది. దీంతో ఒక్క‌సారిగా అంద‌రూ అప్ర‌మ‌త్తం అయ్యారు. దీంతో క‌రోనా బాధితులు ఎవ‌రెవ‌రిని క‌లిశారో ఇప్పుడు వారికోసం ఆరా తీస్తోన్న పోలీసులు వారంద‌రిని కూడా ఐసోలేష‌న్ వార్డుల‌కు త‌ర‌లించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: