క‌రోనా వైర‌స్(కోవిడ్‌-19) మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృభిస్తుంది. ఈ ర‌క్క‌సి వ్యాప్తి నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ చర్యల ఫలితంగా మూడు బిలియన్లు అంటే 300 కోట్ల మందికి పైగా ప్రజలు లాక్‌డౌన్‌లో ఉంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డోక‌క్క‌డ క‌రోనా పాసిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా.. భార‌త్‌లోనూ క‌ల‌క‌లం రేపుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 194 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 987కు చేరుకుంది. 

 

ఇక కరోనా వైరస్‌తో దేశంలో ఇప్పటివరకు 25 మంది మృతి చెందారు. దీంతో కేంద్రం పలు క‌ఠ‌న‌ చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌ను ఎవరూ ఉల్లంఘించకుండా క‌ఠ‌న శిక్ష‌లు త‌ప్ప‌వ‌ని సూచిస్తుంది. అలాగే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తోంది. ఇక తాజాగా తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ క‌రోనాపై స్పందిస్తూ.. కరోనా పోరులో ప్రపంచ దేశాల కంటే భారత్‌ ఎంతో ముందుందని వెల్ల‌డించారు.

వివిధ దేశాల్లో ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. అగ్రారాజ్యంలో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక చైనా, ఇటలీ, స్పెయిన్‌లో మారణహోమమే సృష్టిస్తోంది. అయితే సమర్థవంతమైన లాక్‌ డౌన్‌ చర్యలతో మన దేశంలో కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావాన్ని తగ్గించగలిగామని ఆయ‌న చెప్పుకొచ్చారు.  ఇళ్ల వద్దనే ఉంటూ, సామాజిక దూరం పాటించి వైరస్‌ విస్తరణ చైన్‌ను తెగ్గొట్టాలని కేటీఆర్ కమాన్ ఇండియా అంటూ ఆయన భారతీయులందరికీ పిలుపునిచ్చారు. 

 

దేశవ్యాప్తంగా మరణాల రేటును తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన జాన్‌ బర్న్‌ ముర్డోచ్‌ రూపొందించిన గ్రాఫ్‌ను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. గ్రాఫ్‌లో 10 నుంచి 10 వేల మరణాలు ఏయే దేశాల్లో ఎలా నమోదయ్యాయనే వివరాలు ఇచ్చారు. బెల్జియం, భారత్‌ అన్నిటికన్నా ముందే లాక్‌డౌన్‌ ప్రకటించాయని గ్రాఫ్‌లో పేర్కొన్నారు. మ‌రియు మంత్రి కేటీఆర్ ఇండియా కరోనాను ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేశారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: