ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణ మృదంగం క్రియేట్ చేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌లు పాటించ‌మ‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తున్నా ప్ర‌జ‌లు నిత్యావ‌స‌రాలు.. ఇత‌ర‌త్రా అవ‌స‌రాల కోసం బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే వీరంద‌రు ఒక‌రినొక‌రు క‌లుసుకోవ‌డం.. సామాజిక దూరం పాటించ‌క‌పోవ‌డం లాంటి కార‌ణాల‌తో క‌రోనా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాప్తి చెందుతోంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 6.65 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఇక ఇటలీలో మృతులు 10 వేలు దాటితే... స్పెయిన్‌లో 6 వేలు దాటేసింది.

 

ఇక అగ్ర‌రాజ్యంలో అయితే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి సూప‌ర్ మార్కెట్ల‌ను లూటీ చేసి మ‌రీ నిత్యావ‌స‌రాలు ప‌ట్టుకుని వెళుతున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశంలో మొత్తం 1.23 లక్ష‌ల మందికి క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టికే అక్క‌డ 2223 మంది మృతి చెందారు. ఇట‌లీలో 10 వేల మ‌ర‌ణాలు సంభ‌వించ‌డానికి ప‌ట్టిన టైంతో పోలిస్తే అమెరికాలోనే క‌రోనా వృద్ధి రేటు ఎక్కువుగా ఉన్న‌ట్టు చెపుతున్నారు.

 

మ‌రో షాక్ ఏంటంటే ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు రోడ్ల‌మీద‌కు వ‌స్తోన్న పోలీసుల‌కు సైతం ఇప్పటికే 12 శాతం క‌రోనా సోకిన‌ట్టు చెపుతున్నారు. ఇక అక్క‌డ 11 వేల బెడ్లు ఉన్నా కూడా వైద్యం అందించ‌లేని ప‌రిస్థితి ఉందంటేనే అమెరికా ఎలా చేతులు ఎత్తేస్తోందో చెప్ప‌క‌నే చెపుతోంది. మ‌రో రెండు రోజుల్లో అమెరికాలో మ‌రో 50 వేల కేసుల‌తో పాటు మ‌రిన్ని మ‌ర‌ణాలు సంభ‌విస్తాయ‌ని లెక్క‌లు వేస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: