దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చిన వారిని, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్ లో ఉంచుతున్న విషయం తెలిసిందే. క్వారంటైన్ లో ఉంచిన వారికి వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందిస్తున్నారు. క్వారంట జోర్నీ అనే పదం నుంచి క్వారంటైన్ అనే పదం పుట్టుకొచ్చింది. ఈ విధానం ద్వారా వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందదు. 
 
క్వారంటైన్ వైరస్ ను తరిమికొట్టలేకపోయినా ఒకరి నుంచి వైరస్ ను మరొకరికి వ్యాపించకుండా ఆపడంలో మాత్రం సహాయపడుతుంది. ప్రపంచదేశాలన్నీ కరోనా విషయంలో క్వారంటైన్ పైనే ఆధారపడుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా కరోనా సోకకుండా క్వారంటైన్ ఏర్పాట్లు చేశారు. సాధారణంగా క్వారంటైన్ అంటే ఒక గదికి ఒకరిని మాత్రమే పరిమితం చేయాలి. కానీ గదుల కొరత, ఇతరత్రా కారణాల వల్ల ప్రభుత్వాలు కొన్ని ప్రాంతాలలో ఒకరి కంటే ఎక్కువ మందిని ఒకే గదిలో ఉంచుతున్నాయి. 
 
పడకల మధ్య మాత్రం గ్యాప్ ఉండే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వారంటైన్ లో ఉండేవారు ప్రభుత్వాలు ఈ విధంగా ఏర్పాట్లు చేయడంపై విమర్శలు చేస్తున్నారు. క్వారంటైన్ గదులలో ఒకరి కంటే ఎక్కువ మందిని ఉంచితే ఒకరికి వైరస్ సోకినా తాము వైరస్ భారీన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 
ప్రభుత్వాలు క్వారంటైన్ లో ఉండే వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే క్వారంటైన్ వల్ల వైరస్ భారీనా పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ తరహా ఫిర్యాదులు క్వారంటైన్ లో ఉండే వారి నుంచి వినిపిస్తూ ఉండటం గమనార్హం. ఇలాంటి ఫిర్యాదులు వస్తూ ఉండటంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. తెలంగాణలో ఇప్పటివరకూ 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 19 కేసులు నమోదయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: