మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాల మీద దాడి కొనసాగిస్తోంది. దాని ధాటికి చిక్కుకున్న జనులు, విల విల్లాడిపోతున్నారు. కరోనా జన్మస్థానం అయిన చైనాలో మాత్రం.. తగ్గుముఖం పట్టింది. అగ్రరాజ్యమైన అమెరికా మాత్రం విపరీతమైన ప్రాణ, ధన నష్టాన్ని మూటగట్టుకుంటోంది.  ఇక ఇటలీ గురించి అందరికి తెలిసినదే. అక్కడి పరిస్థితి పూర్తిగా చేయిదాటి, ఆ దేశ అధ్యక్షుడి చేత కన్నీరు పెట్టించింది. స్పెయిన్ సంగతి కూడా అలానే వుంది.

 

మన భారతదేశ సంగతి గాని చూసుకుంటే మాత్రం... కేంద్రం వివిధ రకాల కట్టు దిట్టమైన చర్యలు చేపట్టినప్పటికీ... కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుందనే చెప్పాలి. అయితే ప్రస్తుత లాక్ డౌన్ పధ్ధతి వలన కొంత మేలు జరుగుతుందనేది వాస్తవం. ఇలాంటి పరిస్థితులలో కూడా... కొందరు పౌరులు మాట వినని పరిస్థితి. అందువల్లననే దేశంలో ఇపుడు 144 సెక్షన్ పరిస్థితి.

 

మన రాష్ట్రాల తీరుతెన్నులు కూడా అదే విధంగా ఉందనే చెప్పాలి. లాక్ డౌన్ కారణంగా ప్రజల అవసరాల నిమిత్తం, ఏపీ ముఖ్యమంత్రి జగన్ వివిధ చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే... ఆదివారం, అనగా ఈరోజు రేషన్ డిపోలలో ఉచితంగా పంచదార, బియ్యం, కందిపప్పు అందించారు. సామజిక దూరం నేపథ్యంలో జనులు తమ తమ సరుకులను స్వీకరించారు.

 

ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. 672,086 మంది కరోనా బారిన పడగా.. 31,191 మంది మరణించారు. 143,870 బాధితులకు కరోనా నుండి విముక్తి లభించింది. మన ఇండియాలో గాని, చూసుకుంటే... 987 మంది కరోనా కోరల్లో చిక్కుకున్నారు. వారిలో 25 మరణించగా... 87 మంది బయట పడ్డారు. ఇక మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రలను పరిశీలిస్తే మాత్రం... ఇప్పటికి 73 మందికి కరోనా సోకగా... ఒక్కరికి తెలంగాణలో మరణం సంభవించింది..

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: