అగ్ర రాజ్యం అమెరికా కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో ఇప్పటివరకూ 1,22,666 కరోనా కేసులు నమోదయ్యాయి చైనాలో నమోదైన కేసుల కంటే అమెరికాలో నమోదైన కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రతిరోజూ వందల సంఖ్యలో అమెరికాలో మృత్యువాత పడుతున్నారు. ఈరోజు ఉదయానికి అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 2,211కు చేరింది. 
 
నిన్న ఒక్కరోజే 23 శాతం కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. బాధితుల్లో సగానికి పైగా న్యూయార్క్ నగరానికి చెందిన వారే కావడం గమనార్హం. ఇప్పటివరకూ తెలుస్తున్న సమాచారం మేరకు వయస్సు పై బడిన వారే ఎక్కువగా అమెరికాలో కరోనా భారీన పడి మృతి చెందుతున్నారు. చాలా అరుదుగా యువత, చిన్నారులు మరణిస్తున్నారు. అమెరికాలో కరోనా ఈ స్థాయిలో విజృంభించడానికి ప్రభుత్వం చేసిన తప్పులే కారణమని తెలుస్తోంది. 
 
అమెరికా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పరిస్థితి అదుపు తప్పిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెస్టింగ్ కిట్స్ లోపాల వల్ల అమెరికాలో భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయని అక్కడి వైద్యులు చెబుతున్నారు. అమెరికా కరోనా విషయంలో చైనా నుంచి కిట్లను కొనుగోలు చేయకుండా సొంత కిట్లపై ఆధారపడింది. కానీ పరిస్థితి చేజారిపోయి ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ అగ్రరాజ్యం కేసుల్లో కూడా అగ్ర స్థానంలో నిలుస్తోంది. 
 
ఇప్పటికీ లాక్ డౌన్ ప్రకటించకపోవడం అమెరికా చేసిన పెద్ద తప్పు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ వేల సంఖ్యలో కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి. వెంటిలేటర్ల కొరత కూడా మృతుల సంఖ్య భారీగా పెరగడానికి కారణమైంది. తాజాగా అమెరికాలో తక్కువ వయసు చిన్నారి చనిపోయినట్లు తేలింది. శిశువుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: