క్ష‌ణం క్ష‌ణం విజృంభిస్తోన్న క‌రోనా వైర‌స్ భార‌త్‌లో గ‌త 24 గంట‌ల్లోనే రెచ్చిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో ఉన్న క‌రోనా కేసుల సంఖ్య 979కు చేరుకుంది. ఆదివారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం  గ‌త 24 గంట‌ల్లోనే క‌రోనా మ‌న దేశంలో రెచ్చిపోయింది. 24 గంట‌ల్లో 106 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దేశంలోనే అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 196 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో కేర‌ళ ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ప‌రిస్థితులు అదుపు త‌ప్పేలా ఉన్నాయి.

 

ఇక రాజ‌స్థాన్లో 55 కేసులు, తెలంగాణ‌లో 67 కేసులు ఉంటే ఏపీలో 19 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ప్ర‌స్తుతానికి మ‌న దేశంలో 867 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక క‌రోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు 25 మంది మృతి చెందారు. ఇక తాత్కాలిక వైద్య సిబ్బంది కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఆఘమేగాల మీద రు. 50 కోట్లు విడుద‌ల చేసింది. ఇక పంజాబ్‌లో బ్యాంకులు వారానికి కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించాయి. ఇక 24 గంట‌ల ప‌రిస్థితి ప‌రిశీలిస్తే ఇంత త‌క్కువ వ్య‌వ‌ధిలోనే ఏకంగా ఇంత‌గా విజృంభిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: