చైనా అంటే వింత వింత వస్తువులు కనుగొంటారని తెలుసు.. ప్రపంచంలో ఎంతో టెక్నాలజీ సాధించిన దేశం అని తెలుసు.. చాలా వరకు ఇక్కడ నుంచి ఎన్నో రకాల చైనా దిగుమతు చేసుకుంటారు ఎన్నో దేశాల వారు.. అలాంటి చైనాలో పుహాన్ లో పుట్టుకొచ్చిన భయంకరమైన కరోనా వైరస్  ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలను హడలెత్తిస్తోంది.  ఈ వైరస్ మానవులకు సంక్రమించినట్టు గుర్తించారు.

 

కాగా, చైనాలో మొట్టమొదటి కరోనా బాధిత వ్యక్తి ఓ మహిళ. ఆమె ఆచూకీని వాల్ స్ట్రీట్ జర్నల్ మీడియా సంస్థ గుర్తించింది. ఆమె పేరు వుయ్ జుషాన్. వుహాన్ నగరంలోని సీ ఫుడ్ మార్కెట్లో జుషాన్ రొయ్యలు విక్రయిస్తుంటుంది. అయితే డిసెంబరు 10న జలుబు, జ్వరం, దగ్గుతో ఆమె ఆసుపత్రికి వెళ్లగా, సాధారణ జ్వరంగా భావించిన వైద్యులు కొద్దిపాటి ట్రీట్ మెంట్ తో ఇంటికి పంపించారు. కానీ జ్వరం, జలుబు, శ్వాసకోస ఇబ్బంది రోజు రోజుకీ పెరిగిపోయింది. 

 

ఆమెకే కాదు ఆమెలా మరికొంత మంది సీ ఫుడ్స్ అమ్మేవారి పరిస్థితి వేలు దాటి పోవడంతో వైద్యపరీక్షల్లో అదో ప్రాణాంతక వైరస్ గా గుర్తించి కరోనా అని పేర్కొన్నారు. అటు, వుహాన్ లోని సీ ఫుడ్ మార్కెట్ ను మూసివేయించారు. ఈ వైరస్ భూతం చైనా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఇప్పుడు ప్రపంచదేశాలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా, ఈ వైరస్ వ్యాప్తిపై జుషాన్ స్పందిస్తూ, చైనా ప్రభుత్వం మొదట్లోనే స్పందించి ఉంటే ఇన్ని మరణాలు సంభవించి ఉండేవి కావని అభిప్రాయపడింది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: