క‌రోనా వైర‌స్(కోవిడ్‌-19) ప్ర‌పంచ‌దేశాలు అతి వేగంగా విస్త‌రిస్తూ.. ప్ర‌జ‌ల‌ను అత‌లా కుత‌లం చేస్తోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ దాదాపు అన్ని దేశాలు శ‌ర‌వేగంగా పాకేసింది. భార‌త్‌లో సైతం క‌రోనా రోజురోజుకు విజృంభించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. దీంతో కేంద్రం అల‌ర్డ్ అయ్యి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధంచింది. అయిన‌ప్ప‌టికీ క‌రోనా కేసులు న‌మోదు అవుతూనే ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దీంతో ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి చర్యలు ప్రారంభించింది.. ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

 

ఇప్ప‌టికే ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గురవుతున్నారు. అయితే కరోనా నివారణ చర్యల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు... ఆధునిక టెక్నాలజీతో, సాంకేతిక నిపుణులైన అధికారుల బృందంతో ఏపీ పోలీస్ శాఖను  ముందుకు తీసుకెళ్తున్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టడానికి పోలీసులు ప్రత్యేకంగా జియో ఫెన్సింగ్‌తో పనిచేసే హౌస్‌ క్వారంటైన్‌ యాప్‌ను రూపొందించారు. దీన్ని విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని నిబంధన పెట్టారు. 

 

ఈ యాప్‌లో వివరాలన్నీ నమోదు చేస్తారు. తర్వాత వారిపై నిఘా ఉంటుంది.. ఇంటి నుంచి బయటకు వస్తే డీజీపీ కార్యాలయానికి, సంబంధిత జిల్లా ఎస్పీకి అలెర్ట్‌ వెళ్లేలా రూపొందించారు. విదేశాల నుంచి వారితో పాటు బయట ప్రదేశాల్లో తిరగడం వల్ల కరోనా వైరస్ సోకుతుందని వైద్యులు చెబుతున్నా వినిపించు కోవడం లేదని, ఇష్టం వచ్చినట్లు పబ్లిక్ గా తిరుగుతున్నారని, అలాంటి వారిని అదుపు చేసేందుకు అధికారులు హౌస్‌ క్వారంటైన్ యాప్‌ను తీసుకువ‌చ్చారు. హౌస్‌ క్వారంటైన్‌ యాప్‌ వల్ల హోం క్వారంటైన్ లో ఉన్న వాళ్లు ఎక్కడికి వెళ్లారు.. ఏం చేస్తున్నారని విషయాల్ని సులభంగా తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో పోలీసులు జియో ట్యాగింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple  
 

మరింత సమాచారం తెలుసుకోండి: