క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచంలో ధ‌నికుల నుంచి పేద‌లు.. నిరుపేద‌ల వ‌ర‌కు అంద‌రూ ఆక‌లితో అల‌మ‌టించ‌డ‌మో లేదా ప‌నులు లేక ఇంట్లోనే కూర్చోవ‌డ‌మో జ‌రుగుతోంది. ఇక ప‌నులు లేని నిరుపేద‌లు. వ‌ల‌స కూలీల బాధ‌లు అయితే వ‌ర్ణ‌నాతీతంగా ఉన్నాయి. ప‌నులు లేక ప‌స్తులు ఉంటోన్న వాళ్లు ఇప్పుడు సొంత ప్రాంతాల‌కు వెల్లేందుకు కూడా వీలులేని ప‌రిస్థితి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ప‌ని చేసేందుకు ఉత్త‌ర భార‌త దేశం నుంచి ఎంతో మంది వ‌ల‌స కూలీలు ఇక్క‌డ‌కు వ‌చ్చారు.

 

ఇప్పుడు ఇక్క‌డ ప‌నులు ఆగిపోవ‌డంతో వారంతా సొంత ప్రాంతాల‌కు వెళ్లేందుకు లాక్ డౌన్ నేప‌థ్యంలో వీలులేని ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇక ఏపీలో వివిధ ప‌నుల నిమిత్తం నేప‌థ్యంలో ఇప్పుడు అక్క‌డ ప‌నులు చేస్తోన్న వారి ప‌రిస్థితి కూడా ముందు నుయ్యి వెన‌క గొయ్యి అన్న చందంగా మారింది. ఇక ఏపీలోని అనంత‌పురం నుంచి యూపీకి వ‌ల‌స కూలీలు త‌మ సొంత రాష్ట్ర‌మైన యూపీకి బైక్‌ల‌పై ప్ర‌యాణం ప్రారంభించారు.

 

ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో యూపీకి వెళ్లేందుకు రైళ్లు, బ‌స్సులు లేక‌పోవ‌డంతో వీళ్లు బైక్‌ల‌నే ఆశ్ర‌యించారు. నాలుగైదు రోజులు క‌ష్ట‌ప‌డితే స్వ‌గ్రామాల‌కు వెళ్లిపోతామ‌ని వారు చెపుతున్నారు. ఇక వీరు అనంతపురం జిల్లాలోని గుంత‌క‌ల్ నుంచి యూపీకి ప్ర‌యాణం ప్రారంభించారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: