ప్రపంచం మొత్తం భయంకరమైన కరోనా వైరస్ పై యుద్దం చేస్తుంది.  ఇప్పటి వరకు ప్రపంచ యుద్దాలు ఆయుధాలు, బాంబులతో చేస్తే ఇప్పుడు కరోనా వైరస్ చేస్తున్న దాడికి చిన్నా, పెద్ద దేశాలు సైతం తలొంచే పరిస్థితి ఏర్పడింది.  మనుషులు దాడి చేస్తే ఆయుధాలతో ఆపొచ్చు.. కానీ కంటికి కనిపించని ఈ భయంకరమైన వైరస్ ని ఎలా అరికట్టాలో తలలు పట్టుకుంటున్న పరిస్థితి.  దేశంలో కరోనా అరికట్టడానికి లాక్ డౌన్ చేసి విషయం తెలిసిందే.  తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలుపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్న  విషయం తెలిసిందే. 

 

తాజాగా ఏపీలో ఇంకా 60 మంది కరోనా వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని, ఇవాళ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవాళ 16 మందికి నెగెటివ్ వచ్చిందని, 195 మందిని ఆసుపత్రుల్లో పరిశీలనలో ఉంచామని పేర్కొంది.  ఈ నేపథ్యంలో కరోనాపై ఏపీ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్ విడుదల చేసింది. 

 

అయితే దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసులు అన్నీ విదేశాల నుంచి వచ్చిన వారికే సోకిందని .. లోకల్ గా చాలా రేర్ కేసులు ఉన్నాయని తెలిసిందే.  విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 29,367 మందిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 19 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: