క‌రోనా వైర‌స్‌పై  అమెరికా అధ్య‌క్షుడు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు హాస్యాస్ప‌దంగా ఉన్నాయ‌ని  ప్రముఖ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. ఇటీవ‌లి కాలంలో అమెరికా అధ్య‌క్షుడిపై కేఏ పాల్ వ‌రుస‌గా కామెంట్లు చేస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న వ్యాఖ్య‌ల్ని ఒక వీడియో రూపంలో బీబీసీ సోష‌ల్ మీడియాలో పెట్టింది. ఆ వీడియోలో కేఏ పాల్ అగ్ర‌రాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య‌లను ఏమాత్రం విశ్వ‌సించ‌లేం అనే అర్థంలో పాల్ మాట్లాడారు. ట్రంప్ నెలరోజుల ముందు ఇదంతా జోక్.. అంటూనే డెమోక్రటిక్స్ పార్టీయే సృష్టించిందంటూ పేర్కొన్నారు. ఆ తర్వాత గత ఆదివారం దేశంలో క‌రోనా వైర‌స్ పూర్తిగా కంట్రోల్‌లో ఉంద‌ని వ్యాఖ్య‌నించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

 

 ఇక మూడు రోజుల కింద‌ట మా దగ్గర మెడిసన్ ఉందని చెప్పిన‌ట్లుగా పేర్కొన్నారని..వ‌రుస‌గా ఇలా అబ‌ద్దాలాడుతున్న అమెరికా అధ్య‌క్షుడిని ఎలా విశ్వ‌సిస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇదిలా  ఉండ‌గా త‌న‌కు తెలిసినంత వ‌ర‌కు క‌రోనా వ్యాధికి మందు గాని వ్యాక్సిన్‌గాని క‌నుగొన‌బ‌డ‌లేద‌ని అన్నారు. ఇప్ప‌టికే ఇదే విష‌యాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్ర‌క‌టించిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీలు పెట్టకండి అంటూ రాజకీయ పార్టీల్ని పాల్ కోరారు. అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించిన క‌రోనాపై  రాజ‌కీయాలు చేయొద్ద‌ని  పార్టీల ప్ర‌తినిధుల‌కు సూచించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై ప్రెస్‌మీట్లుగాని, ర్యాలీలు గాని,ప్ర‌ద‌ర్శ‌న‌లు గాని నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని,ప్ర‌శాంతంగా ఇంట్లో కూర్చోవ‌డ‌మే ఉత్త‌మ‌మైన మార్గ‌మ‌ని చెప్పారు.

 

అవ‌స‌ర‌మైతే దేవుడి ప్రార్థ‌న చేసిన‌వారు మంచివార‌వుతార‌ని అన్నారు.  కరోనా లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్‌లోనే ఉండాలన్నారు. అయితే ఐసోలేషన్ గురించి త‌న‌కు పెద్ద‌గా అవ‌గాహ‌న లేదన్నారు. దాని గురించి మాట్లాడ‌టానికి నిపుణులు ఉన్నార‌ని పేర్క‌న‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉండ‌గా చైనాలో పుట్టిన వైర‌స్ గురించి ఎప్పటికీ నిజం బ‌య‌ట‌కి రాద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.తాను 27సార్లు చైనా వెళ్లానన్నారు కేఏ పాల్. చైనాలో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉండదన్నారు. అక్కడ అధికారిక లెక్కల ప్రకారం కరోనా వైరస్ వల్ల ఐదుకోట్ల ప్రజలకు ఎఫెక్ట్ అయ్యిందన్నారు. దీని వల్ల లక్షలమంది చనిపోయారన్నార‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: