కరోనా అంటేనే వణుకు. చలిజ్వరం. అసలు ఆ పేరు ఎవరైనా కలలోనైనా తలచుకుంటారా. కానీ రాజకీయ నేతలకు మాత్రం కరోనా అయినా యముడు అయినా ఒక్కటేనేమో, ఎడా పెడా వాడేసుకుంటారు. వరద రాజకీయం, బురద రాజకీయం చేసే ఆసాములున్న దేశంలో కరోనాని కూడా ఎందుకు వాడేసుకోరు. 

 

అందుకే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. చంద్రబాబు ఆయన బ్యాచ్ కి కరోనా ఏడాది ముందు వచ్చి ఉంటే బాగుండేదన్న క్రూర ఆలోచనలు పుడుతున్నాయని సెటైర్లు వేస్తున్నారు. 2019 మార్చి నెలల్లో కరోనా ఎందుకు రాలేదని పచ్చ పార్టీ పెద్దలు తెగ ఫీల్ అవుతున్నారని కూడా విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్  వేస్తున్నారు.

 

కరోనాని అడ్డం పెట్టుకుని స్థానిక ఎన్నికలను వాయిదా వేయించినట్లుగా గత ఏడాది సాధారణ ఎన్నికలను కూడా వాయిదా వేయించేవాళ్ళమని, ఆ తరువాత ఏదో కిందా మీద పడి ఫలితాలను అనుకూలం చేసుకునేవారమని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున బాధ పడుతున్నారుట. కరోనా విషయంలో హైదరాబాద్ లో కూర్చుని చంద్రబాబు వైసీపీ సర్కార్ మీద  కుట్రలు చేస్తున్నారని, కుళ్ళు రాజకీయం చేస్తున్నాడని కూడా విజయసాయి అంటున్నారు.

 


ఏపీలో అన్ని విధాలుగా కరోనాని కట్టడి చేస్తూ జగన్ సీఎంగా చక్కగా చర్యలు తీసుకుంటూంటే చంద్రబాబుకు, ఆయన గారి తమ్ముళ్ళకు మింగుడుపడడంలేదని విజయసాయి అంటున్నారు. ఏపీ దేశంలో విస్తీర్ణంలో ఎనిమిదవ‌ స్థానంలో, జనాభాలో పదవ స్థానంలో ఉందని, ఇంత పెద్ద రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదు అయ్యాయని, దానికి జగన్ ముందు చూపు, వాలంటీర్లతో ఎక్కడికక్కడ మధింపు చేయడమే కారణమని విజయసాయి అంటున్నారు.

 

దాన్ని కూడా ఓర్వలేక ఎందుకు ఇలా కరోనా కట్టడి అవుతోందనుకునే రకాలు టీడీపీ వాళ్ళు అని కూడా విజయసాయి ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి ఏపీలో టీడీపీ ఉంది. తెలంగాణాలో కరోనా కేసులు ఎక్కూవగా ఉన్నాయి. మరి కేసీయార్ ని ఈ విషయంలో సరిగ్గా పనిచేయలేదని చంద్రబాబు అనగలరా. అంటే ఆ సత్తా లేదు, ఎంతసేపూ జగన్ మీద ఏడుపే అన్నమాట. మొత్తానికి కరోనా రాజకీయంలో టీడీపీ ఎక్కడా తగ్గడంలేదని వైసీపీ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: